Advertisement
Google Ads BL

అమ్మతో హైదరాబాద్ కి బిగ్ బాస్ బ్యూటీ


బిగ్ బాస్ కి ముందు సినిమాల్లో హీరోయిన్ గా నటించినా బిగ్ బాస్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అంటూ కెరీర్ లో దూసుకుపోతున్న మోనాల్ గజ్జర్ కి సినిమాలు ఎంత మేలు చేశాయో తెలియదు కానీ.. బిగ్ బాస్ మాత్రం పాప కి బాగా మేలు చేసింది. బిగ్ బాస్ లో అఖిల్ సార్థక్ తో మోనాల్ మూమెంట్స్ అన్ని స్టార్ మా కి క్రేజీ టీఆర్పీ తెచ్చిపెట్టింది. మోనాల్-అఖిల్ సార్థక్ బిగ్ బాస్ లో ప్రేమ జంటగా ప్రోజెక్ట్ అవడంతో.. వారికీ బాగా పాపులారిటీ పెరిగింది. దానితో మోనాల్ - అఖిల్ బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక కెరీర్ లో ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు. మోనాల్ కి అయితే స్పెషల్ సాంగ్స్, సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. అంతేకాదు.. స్టార్ మా లో మోనాల్ డాన్స్ ప్లస్ షో కి జేడ్జ్ గా గ్లామర్ గా అదరగొట్టేసింది. 

Advertisement
CJ Advs

తాజాగా డాన్స్ ప్లస్ షో ముగిసింది. మోనాల్ ఫ్రీ అయినా.. అఖిల్ తో అమ్మడు ఓ వెబ్ సీరీస్ చేస్తుంది. ఇక అఖిల్ కూడా సినిమా హీరోగా లాంచ్ అవ్వబోతున్నాడు. అయితే మోనాల్ డాన్స్ ప్లస్ షో పూర్తి కాగానే తన సొంతూరు గుజరాత్ కి వెళ్లిపోవడంతో మోనాల్ కి అవకాశాలు తగ్గాయేమో అనుకున్నారు. కానీ మోనాల్ కొద్దిగా గ్యాప్ తీసుకుని తల్లితో పాటుగా హైదరాబాద్ లో అడుగుపెట్టింది. అంతేకాదు.. హైదరాబాద్ లో ఈ బ్యూటీ ఇల్లు కొనేసింది. 

ఆ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తాను హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కుని ఇక్కడే ఉండబోతున్నా అని, దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఇప్పుడు నాకో ఇల్లు దొరికింది. సో.. నేను కూడా అఫీషియల్‌గా హైదరాబాదీని అయ్యాను. జై శ్రీకృష్ణా.. గోవిందా గోవిందా అంటూ దర్శకనిర్మాతలకు హింట్ ఇచ్చేసింది. 

Monal gajjar ready to buy a new house in Hyderabad city:

Monal Gajjar to Settle Down in Hyderabad
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs