మా ఎన్నికల్లో చిరు మద్దతు ఎవరికనేది ఆయన తమ్ముడు నాగబాబు తేల్చిపారేశారు. చిరు అన్నయ్య మద్దతు ప్రకాష్ రాజ్ కె అంటూ నాగబాబు మీడియా ముఖంగా చెప్పాక.. చిరు సపోర్ట్ మరెవరికి లేదు అనేది తేలిపోయింది. లేదంటే చిరు మద్దతుపై మీడియాలో రకరకాల కథనాలు వండి వారుస్తున్నారు. ఇక ఇప్పుడు మంచు విష్ణు ఏం చేయబోతున్నారో అనే క్యూరియాసిటీ మొదలైంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ గట్టి పోటీకి రెడీ అయ్యింది. మంచు విష్ణు పెద్ద తలకాయల సపోర్ట్ కోసం తిరుగుతున్నాడు. ప్యానల్ ని ప్రకటించలేదు. మోహన్ బాబు కొడుకు కోసం తెర వెనుక గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట.
అందులో ముఖ్యంగా మెగా కాంపౌండ్ సపోర్ట్ లేకపోయేసరికి మోహన్ బాబు ఇప్పుడు బాలయ్య సపోర్ట్ కోసం రెడీ అవుతున్నారట. ఈమధ్యన బాలకృష్ణ కి చిరు కి మధ్యన కోల్డ్ వార్ జరుగుతుంది. ఇప్పుడు మా ఎన్నికల్లో బాలకృష్ణ మోహన్ బాబు కోసం విష్ణు ని సపోర్ట్ చేస్తే అది డైరెక్ట్ వార్ అవడం ఖాయం అంటున్నారు. మరి మోహన్ బాబు బాలకృష్ణ సపోర్ట్ కోరతారా? ఎందుకంటే రాజకీయంగా మోహన్ బాబు ఫ్యామిలీ జగన్ కి సపోర్ట్ గా ఉంటుంది. టిడిపి కి వైసిపి కి ఉప్పు - నిప్పు లా ఉంది వ్యవహారం. మరి బాలయ్య ని ఇలాంటి పరిస్థితుల్లో మోహన్ బాబు సాయమడుగుతాడా? కాదు కొడుకు కోసం ఏమైనా చేద్దామని ఫిక్స్ అయితే బాలయ్య గడప తొక్కుతాడు... లేదంటే కామ్ గా చూస్తుంటాడు.
ఏది ఏమైనా బాలయ్య బరిలోకి దిగితే.. ఇప్పుడు మా ఎన్నికల్లో బాలకృష్ణ పాత్ర కూడా మొదలు కాబోతుంది అనేది మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ లు చూస్తే తెలుస్తుంది. చిరు ముచ్చట ముగిసింది.. బాలయ్య ముచ్చట ఏమైనా మొదలవుతుందా అనేది ఇప్పుడు అందరిలో మొదలైన ఆసక్తి.