Advertisement
Google Ads BL

ఎందుకింత కఠిన నిర్ణయం


టాలీవుడ్ లో డైరెక్టర్ గా మారాక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన కొరటాల శివ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిమరో హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను.. తాజాగా ఆచార్య మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చిరు - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆచార్య తర్వాత కొరటాల ఫుల్ స్వింగ్ లో ఎన్టీఆర్30 అంటూ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రస్తుతం సెకండ్ వేవ్ తర్వాత కొరటాల ఆచార్య ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా కొరటాల శివ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అది తాను సోషల్ మీడియా నుండి వైదొలుగుతున్నట్టుగా ప్రెస్ నోట్ విడుదల చేసి అందరికి షాకిచ్చారు. సోషల్ మీడియాలో హీరో ల ఫాన్స్ వార్ జరుగుతుంటాయి. మధ్యలో అప్పుడప్పుడు దర్శకులని కూడా ఫాన్స్ ఆడుకుంటూ ఉంటారు. అలాగే చాలామంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమ అప్ డేట్స్ ని అందరికన్నా ముందే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హీరోల అభిమానులకి చేరువలో ఉంటున్న టైం లో కొరటాల సోషల్ మీడియా నుండి వైదొలగడం సంచలనం గా మారింది.  

కొరటాల అసలు ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆచార్య రిలీజ్ టైం, ఎన్టీఆర్30 మొదలు కాబోయే టైం లో కొరటాల ఇలాంటి షాకిచ్చేరేమిటి చెప్మా అంటూ మెగా అండ్ ఎన్టీఆర్ ఫాన్స్ తెగ వర్రీ అవుతున్నారు. 

Koratala Siva bids adieu to Social Media :

Koratala Siva quits Social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs