చాలా రోజులుగా రాధేశ్యామ్ అప్ డేట్ విషయంలో ప్రభాస్ ఫాన్స్ నిరాశతో ఉంటున్నారు. ప్రభాస్ - పూజ హెగ్డే కలయికలో రాధకృష్ణ తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ సినిమాని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదలైనప్పటినుండి.. అప్ డేట్స్ విషయంలో ప్రభాస్ ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. అలాగే ప్రభాస్ లుక్స్ పై కూడా ఫాన్స్ కి కంప్లైంట్ ఉంది. అయితే జులై 30 న విడుదలకు రంగం చేస్తున్న రాధేశ్యామ్ షూటింగ్ సెకండ్ వేవ్ వలన ఆగిపోవడంతో.. ఇప్పుడు సినిమా కూడా అనుకున్న టైం వచ్చే ఛాన్స్ లేకుండా పోయింది.
సెకండ్ వేవ్ తర్వాత రాధేశ్యామ్ షూటింగ్ జూన్ చివరి వారంలో మొదలు కాబోతుంది అని అన్నారు. అన్నట్టుగానే నేడు రాధేశ్యామ్ షూటింగ్ హైదరాబాద్ లోని స్పెషల్ సెట్ లో మొదలైపోయింది. రాధేశ్యామ్ సాంగ్ చిత్రీకరణతో పాటుగా.. ప్రభాస్ కి సంబందించిన కొన్ని సీన్స్ ని రీ షూట్ బాలన్స్ చెయ్యబోతున్నారు. అయితే ఇప్పుడు ఆ సాంగ్ తో పాటుగా మిగిలిన సీన్స్ చిత్రీకరణ కూడా సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తి చెయ్యాలని రాధేశ్యాం మేకర్స్ చూస్తున్నారట. రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసేసి ప్రభాస్ అటు సలార్ ఇటు ఆదిపురుష్ మూవీస్ షూటింగ్స్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తుంది. ఇక తాజాగా రాధేశ్యాం రెస్యూమ్ షూట్ మొదలవడంతో ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ ఆ సినిమా అప్ డేట్ ని ట్రెండ్ చేస్తున్నారు.