Advertisement
Google Ads BL

ఏమిటండి ఈ అభిమానం


నిన్న రష్మిక కోసం ఆమె అభిమాని 900 కిలోమీటర్లు ప్రయాణించి.. రష్మిక ని కలవాడనికి స్తోత్రంతో ఆమె ఊరికి వెళ్ళాడు. గూగుల్ లో ఇల్లు సెర్చ్ చేస్తూ రష్మిక కోసం వెళ్లిన ఆమె అభిమాని ఆకాష్ కి రష్మిక దర్శనం దొరకలేదు. ఉసూరుమంటూ వెనక్కి వచ్చేసాడు. తాజాగా రామ్ చరణ్ అభిమానులు కొందరు కూడా ఇలానే చరణ్ పై వెర్రి అభిమానం చూపించారు. రామ్ చరణ్ ని చూడాలి, ఆయనని కలిసి ఫొటోస్ దిగాలని అనే పిచ్చి కోరికతో జోగలాంబ గద్వాల నుంచి ముగ్గురు అభిమానులు 231 కిలోమీటర్లు నడిచి చరణ్ ని చేరుకున్నారు.  

Advertisement
CJ Advs

సంధ్య రాజ్, రవి, వీరేష్ ముగ్గురు రామ్ చరణ్‌కు డైహార్డ్ ఫ్యాన్స్. రామ్ చరణ్ ని చూడాలనే తపనతో నాలుగు  రోజుల పాటు 231 కిలోమీటర్లు కాలినడకన హైదరాబాద్ చేరుకున్న ఆ ముగ్గురు అభిమానులని రామ్ చరణ్ పలకరించి ఫొటోస్ ఇవ్వడమే కాదు.. ఆలింగనం చేసుకుని.. కాసేపు వాళ్లతో ముచ్చటించి అభిమానులక కోరికని తీర్చేసాడు. తన పైన వారు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు చెప్పడమే కాదు వాళ్లతో ఫొటోస్ కూడా దిగాడు. మరి అభిమానం ఉంటె ఉండొచ్చు. కానీ ఇలా కాలినడకన ఇబ్బందులు ఎదుర్కుంటూ అభిమానం చూపించడమే షాకింగ్ విషయం. 

Ram Charan Meets his Fans:

Ram Charan meets his hardcore fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs