కరోనా సెకండ్ వేవ్ తో ఒణికి పోయిన టాలీవుడ్ ఇప్పుడు మా ఎన్నికల విషయంలో మరింత హాట్ హాట్ గా మారింది. ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు - జీవిత - హేమా లు మా అధ్యక్ష పీటంకోసం పోటీపడుతున్నారు. తాజాగా మా ఎన్నికల్లో చిరు మద్దతుపై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఆ విషయం గురించి నటుడు ప్రకాష్ రాజ్ తాజా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. తన ప్యానల్ సభ్యులు శ్రీకాంత్, నాగబాబు, అనసూయ లతో ప్రెస్ మీట్ కి హాజరైన ప్రకాష్ రాజ్.. మా ఎన్నికల విషయంలో చిరుని లాగొద్దని, అంతేకాకుండా ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అనే మాట వద్దని, నటులు అంటే ఒక ప్రాంతానికే పరిమితం కాదని.. నటులు యూనివర్సల్ అనే విషయాన్ని తెలుసుకోవాలని చెప్పారు.
పొలిటికల్ గా నాగబాబు తో తనకి విరోధం ఉంది అని, కానీ సినిమా ఇండస్ట్రీ పరంగా తామంతా ఒక్కటే అని, అందుకే ఈ ఎన్నికలని అస్సహ్యంగా మారనివ్వకుండా చూడాలని మంచు విష్ణు కి ఫోన్ చేసి చెప్పాను అని, అసలు ఈ ఎన్నికల్లో చిరు ని ఎందుకు లాగుతున్నారో నాకర్ధం కావడం లేదంటూ ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. ఇక తమ ప్యానల్ లో ఉన్న నాలుగురు మా అధ్యక్షులుగా ఉన్నవారే అని, ఏ తేడా వచ్చినా వారు ప్రశ్నిస్తారనే భయం ఉంది అని ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు.