Advertisement
Google Ads BL

బాలయ్య కొత్త ప్రాజెక్ట్ కి మరో మూడు నెలలు


బాలకృష్ణ - బోయపాటి కాంబో అఖండ మూవీ చివరి షెడ్యూల్ కోసం రేపో మాపో పట్టాలెక్కబోతుంది. సెకండ్ వేవ్ వలన ఆగిన షూటింగ్ ని బోయపాటి మరోసారి మొదలు పెట్టబోతున్నాడు. అయితే అఖండ మూవీ ని వినాయకచవితి సందర్భంగా రిలీజ్ చెయ్యొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక అఖండ సంగతి అలా ఉంటే.. బాలయ్య కొత్త ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చెయ్యాలి. బాలయ్య బర్త్ డే కి అధికారిక అనౌన్సమెంట్ వచ్చిన ఈ సినిమాని జులై నుండి పట్టాలెక్కించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది ఓ మూడు నెలలు పాటు పోస్ట్ పోన్ అయినట్లుగా తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

కారణం గోపీచంద్ బాలయ్యని మూడు నెలల టైం అడిగాడని సోషల్ మీడియా టాక్. యదార్ధ ఘటనలతో తెరకెక్కబోతున్న ఈ సినిమా కథని గోపీచంద్ మలినేని బాలయ్య కి వినిపించగా.. బాలకృష్ణ సినిమా క్లైమక్స్ అలాగే, హీరో ఎలివేషన్ సీన పై చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పడంతో గోపీచంద్ వాటిలోని మార్పుల కోసం మూడు నెలల సమయం పడుతుంది. అప్పుడు కథ పూర్తయ్యాక సినిమాని ఫ్రెష్ గా మొదలు పెడదామని చెప్పినట్టుగా తెలుస్తుంది. దానికి బాలయ్య టైం ఎంతయినా తీసుకో.. సినిమా మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి.  

Balayya - Gopichand Malineni Movie 3 month delay:

Balakrishna next with Gopichand Malineni delayed 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs