Advertisement
Google Ads BL

దిల్ రాజు దూకుడు


టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దూకుడు చూస్తుంటే.. మాములుగా లేదు. పాన్ ఇండియా ఫిలిమ్స్, బాలీవుడ్ మూవీస్, టాలీవుడ్ మూవీస్ తాజాగా కోలీవుడ్ మూవీస్ అంటూ ఏ నిర్మాత చెయ్యని సాహసాలు, ఏ నిర్మాతకు లేని స్పీడు ని చూపిస్తున్నాడు. కోలీవుడ్ శంకర్ తో పాన్ ఇండియా ఫిలిం ని అనౌన్స్ చేసిన దిల్ రాజు అంతలోనే వంశి పైడిపల్లి - విజయ్ మూవీ ని లైన్ లో పెట్టాడు. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ నాంది మూవీ ని రీమేక్ చెయ్యబోతున్నాడు. అజయ్ దేవగన్ తో తెలుగులో సూపర్ హిట్ అయిన అల్లరి నరేష్ నాంది ని రీమేక్ చెయ్యబోతున్నట్టుగా అధికారిక ప్రకటన ఇచ్చాడు. 

Advertisement
CJ Advs

అందరూ ఒక్కొక్క సినిమా నిర్మిస్తూ బిజీగా ఉంటే.. దిల్ రాజు మాత్రం ఒకేసారి నాలుగైదు సినిమాలని నిర్మిస్తూ జోరు చూపిస్తున్నాడు. రామ్ చరణ్ - శంకర్ తో 300 కోట్ల బడ్జెట్ తో మూవీ నిర్మించడానికి రెడీ అయిన దిల్ రాజు.. విజయ్ - వంశి తోనూ రమారమి 250 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నాడట. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వెయ్యబోతున్నాడు. అజయ్ దేవగన్ తో సినిమాని అనౌన్స్ చేసాడు. అల్లరి నరేష్ - వంశి కనకమేడల కాంబోలో తెరకెక్కి.. ఫిబ్రవరి లో థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా సూపర్ టాక్ తో మంచి హిట్ అయ్యింది. దానితో దిల్ రాజు నాంది రీమేక్ రైట్స్ తీసుకుని బాలీవుడ్ అజయ్ దేవగన్ తో సినిమాకి ప్లాన్ చేసి సినిమాని ప్రకటించేశాడు. 

Dil Raju teams with Ajay Devgn for Naandi remake:

Naandi goes to Bollywood in style
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs