Advertisement
Google Ads BL

తటస్థంగా చిరు


టాలీవుడ్ లో మా అధ్యక్ష ఎన్నికలు వేడి మాములుగా లేదు. ప్రకాష్ రాజ్ - విష్ణు - జీవిత మధ్యన నేనున్నాను అంటూ నటి హేమ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుంది. ప్రకాష్ రాజ్ - విష్ణు మధ్యనే గట్టి పోటీ ఉంటుంది అని అంటున్నారు. అయితే ఇప్పుడు మా ఎన్నికల్లో చిరు మద్దతు ఎవరికీ ఉంటుందో అనే దాని మీద ఆసక్తి, క్యూరియాసిటీ అందరిలో అంతకంతకు పెరిగిపోతున్నాయి. టాలీవుడ్ కి పెద్దన్నలా మారిన చిరు మద్దతు ప్రకాష్ రాజ్ కి, విష్ణు కి ఈ ఇరువురిలో ఎవరికీ ఉంటుందో అనేది ఆసక్తిగా మారింది. ఇద్దరూ కావాల్సిన వాళ్ళే. కాబట్టి ఎవరికీ మద్దతు ప్రకటించినా కష్టం. నాగబాబు మద్దతు ఇచ్చేవారికే చిరు అండదండలుంటాయంటున్నారు. 

Advertisement
CJ Advs

నాగబాబు ప్రకాష్ రాజ్ కి మద్దతు ప్రకటించాడు. మంచు విష్ణు కూడా కృష్ణ, కృష్ణం రాజు అంటూ పెద్ద తలకాయలు పట్టుకున్నాడు. మరి ఇప్పడు చిరు మా ఎన్నికల గురించి ఏం చెబుతారు..? ఎలాంటి మద్దతు ఇస్తారు? ఏం నిర్ణయం తీసుకుంటారనేది హాట్ హాట్ గా చర్చిస్తున్నారు. కానీ చిరు మాత్రం మా ఎన్నికల్లో ఎవరికి మద్దతు ప్రకటించకుండా తటస్తంగా ఉంటారని, ఎవరు గెలిచినా వారికీ తన సలహా, సహాయ సహకారాలు అందించాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. మీరు కొట్టుకొండి .. నేను తర్వాత జాయిన్ అవుతాను అన్నట్లుగా చిరు వ్యవహారం ఉంది అంటున్నారు. 

మరి జీవిత కూడా తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టింది. హేమ విషయం పక్కనబెడితే.. మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ - జీవిత మధ్యనే హోరా హోరి పోటీ ఉండొచ్చు అని అంటున్నారు. 

Chiru to support no body in Maa elections:

Chiranjeevi Supports whom in Maa elections? 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs