Advertisement
Google Ads BL

నచ్చకపోయినా.. డబ్బు కోసమే చేశాను


కుమార్ 21F తో అదరగొట్టిన హెబ్బా పటేల్ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. రాజ్ తరుణ్ తో కలిసి నటించిన సినిమాలేవీ ఆమెకి కలిసిరాలేదు. చేతిలో సరైన సినిమా అవకాశాలు లేక, ఐటెం సాంగ్స్ కి అలాగే చిన్న పాత్రలకే పరిమితమవుతున్న హెబ్బా పటేల్ ఈమధ్యన సోషల్ మీడియాని ఊపేస్తుంది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. హెబ్బా ఎంత చేసిన ఆమెకి అవకాశాలు ఇచ్చే దర్శకులు కరువయ్యారు. అయితే తాజాగా హెబ్బా అభిమానులతో మాట్లాడుతూ.. కెరీర్ స్టార్టింగ్ లో తనకి  మెచ్యూరిటీ లేకపోవడం వలన ప్రాధాన్యత లేని సినిమాలు ఒప్పేసుకున్నాను అని, దాని వలన తానూ చాలా కోల్పోవాల్సి వచ్చింది అని.. దాని వలన చాల రకాలుగా ఇబ్బందులు పడ్డాను అని, కానీ ఈ ప్రపంచం ఎలాంటిదో అర్థం చేసుకున్నాను అని చెబుతుంది. 

Advertisement
CJ Advs

తన లైఫ్ లో జరిగిన అనుభవాలతో ఎన్నో కొత్త పాఠాలను నేర్చుకున్నానని.. మళ్ళీ తన కెరీర్‌ను రిస్టార్ట్ చేస్తున్నాను అని తెలిపింది. అయితే చిన్న పాత్రలకి, ఐటెం సాంగ్స్ ఎందుకు చేసారని అడిగితె.. హీరోయిన్ అనే వాళ్ళు కెరీర్ ని కాపాడుకోవాలంటే.. ఏదో ఒకటి చెయ్యాలి. అందుకే నేను నాకు నచ్చకపోయినా, ఆ పాత్రలను అస్సహించుకున్నా కూడా అవి చేశాను. అంటే కేవలం డబ్బు కోసం అలాంటి పాత్రాలు చేశాను తప్ప ఇష్టపడి చెయ్యలేదు అని అంటుంది. కానీ ఫ్యూచర్ లో మాత్రం అలాంటి సినిమాలు చెయ్యను, నా మనసుకు నచ్చిన, నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలనే ఎంపిక చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది హెబ్బా. చూద్దాం హెబ్బా కోరినట్లుగా ఆమెకి ఎవరైనా అవకాశాలు ఇస్తారేమో అనేది. 

Hebah Patel says I Have Rectify My Career Mistakes:

Hebah Patel about Career 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs