Advertisement
Google Ads BL

ఆగష్టు కాదంటున్న ఆచార్య


మే 13 న రిలీజ్ అవ్వాల్సిన ఆచార్య మూవీ సెకండ్ వేవ్ వలన వాయిదా పడింది. లేదంటే మెగా ఫాన్స్ సంబరాలు ఆకాశాన్ని తాకేవి. ఆచార్య సినిమా షూటిగ్ కూడా బ్యాలెన్స్ ఉండిపోయింది. తాజాగా ఆచార్య షూటింగ్ ని కొరటాల మొదలు పెట్టబోతున్నారు. ఓ సాంగ్ చిత్రీకరణతో పాటుగా, రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ మిగిలి ఉండడంతో కొరటాల రామ్ చరణ్ తో కలిసి ఆచార్య సెట్స్ మీదికి వెళ్ళబోతున్నారట. అయితే షూటింగ్ ఓ 15 రోజుల పాటు బాలన్స్ ఉంది.. అది అవ్వగానే పోస్ట్ ప్రొడక్షన్ చేసేసి చిరు పుట్టిన రోజు నాటికి ఆచార్య సిద్ధం చేసి ఆగస్టు లో చిరు బర్త్ డే రోజు ఆచార్య విడుదల ప్లాన్ చేశారని అన్నారు. 

Advertisement
CJ Advs

కానీ తాజాగా ఆచార్య ని ఆగష్టు లో కాదు .. దసరా బరిలో నిలపాలనేది చిరు - కొరటాల ప్లాన్ అంట. దసరా కి హాలిడేస్ ఉంటాయి.. పండగ కూడా కలిసొస్తుంది. అలా దసరాకి ఆచార్య ని దించితే.. బావుంటుంది అని అనుకుంటున్నారట. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో చెర్రీ - చిరు కాంబో సీన్స్ మెయిన్ హైలెట్ గా నిలవబోతున్నట్టుగా మూవీ టీం చెబుతుంది. ఇక చరణ్ - చిరు కాంబో అనగానే సినిమాపై మరింతగా క్రేజ్ పెరిగిపోయింది. 

Acharya to be out this Dasara?:

CHiranjeevi - Koratala Acharya to be out this Dasara?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs