సినిమాల్లో సోను సూద్ అంటే ఓ విలన్. రీల్ విలన్ కాస్త.. ఇప్పుడు అందరికి రియల్ హీరోగా దేవుడయ్యాడు. సెలెబ్రిటీ లేదు, సామాన్య మానవుడు లేడు.. అందరికి సోను సూద్ ఇప్పుడొక దేవుడు అంతే. కరోనా లాక్ డౌన్ సోను సూద్ ని మార్చడమే కాదు.. సోను సూద్ వలన అనేక ప్రాణాలు నిలబడ్డాయి. సాయం అన్నవారికి సోను సూద్ ఆస్తులు తాకట్టు పెట్టి మరీ కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజెన్ ప్లాంట్స్ నెలకొల్పుతూ చేతనైన సహాయం చేస్తున్నాడు. సోను సూద్ అంటే ఓ గాడ్ అనే భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా సోను సూద్ రాజకీయంగా ఎదగడానికి అనేవాళ్ళు లేకపోలేదు.
ప్రస్తుతం తనకి ఎలాంటి ఉద్దేశ్యం లేదని.. ప్రజలకి సేవ చెయ్యడంలో ఉన్న ఆనందం మరెందులోను లేదు అంటున్నాడు సోను సూద్. ఇక తాజాగా సోను సూద్ సూపర్ మార్కెట్ అంటూ ఫ్రీ హోమ్ డెలివరీ మొదలు పెట్టాడు. సోను సూద్ సూపర్ మార్కెట్ లో గుడ్లు దగ్గరనుండి.. బ్రేడ్ వరకు అన్ని నిత్యావసర సరుకులు దొరుకుతాయని. సకాలంలో సరుకుల్ని ఫ్రీ గా ఆర్డర్ చేసిన వారి ఇళ్ళకి చేర్చడమే అని.. సైకిల్ మీద ఈ రియల్ హీరో సరుకుల్ని హోమ్ డెలివరీ చెయ్యడం ఫన్నీగా అనిపిస్తుంది. నిజంగానే సోను సూద్.. సైకిల్ తొక్కుతూ ఇలా సరుకుల్ని ఇంటిఇంటికి డెలివరీ చేయడం మాత్రం నిజంగానే ఫన్నీగా ఉంది.