శేఖర్ కమ్ముల - ధనుష్ కాంబోలో ఓ పాన్ ఇండియా మూవీ సెట్ కావడము, అధికారిక ప్రకటన రావడము చకచకా జరిగిపోయాయి. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల మూవీ.. అందరిని ఆశ్చర్యపరిచే న్యూస్ అది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కబోయే ఆ మూవీ ఇప్పట్లో మొదలు కాదు. కారణం ధనుష్ - సెల్వ రాఘవన్ మూవీ ఉంది కాబట్టి. ధనుష్ ముందు సెల్వ రాఘవన్ మూవీ కంప్లీట్ చేసాక శేఖర్ కమ్ముల మూవీలో జాయిన్ అవుతాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల కూడా తాను తెరకెక్కించిన లవ్ స్టోరీ రిలీజ్ ఎర్పాట్లలో ఉన్నాడు.
ఇకపోతే శేఖర్ కమ్ముల - ధనుష్ మూవీలో హీరోయిన్ గా దాదాపుగా సాయి పల్లవిని కంఫర్మ్ చేసేసారు మీడియా వాళ్ళు. ఎందుకంటే శేఖర్ కమ్ముల తన రెండు సినిమాల్లో సాయి పల్లవిని రిపీట్ చెయ్యడం,ఆమె పెరఫార్మెన్స్ కి అందరూ ఫిదా అవడమే కాదు.. ధనుష్ తోనూ సాయి పల్లవి మారి 2 లో రొమాన్స్ చేసింది. అందులో రౌడీ బేబీ సాంగ్ కి ఎంతటి రెస్పాన్స్ వచ్చింది అందరికి తెలుసు. అలాంటి సాయి పల్లవి.. మరోసారి ధనుష్ తో జోడి కడితే.. ఆ రేంజ్ వేరు అంటూ సోషల్ మీడియాలో శేఖర్ కమ్ముల మరోసారి సాయి పల్లవికి ప్రాధాన్యం ఇస్తారంటూ న్యూస్ లు వచ్చేస్తున్నాయి.
అయితే సాయి పల్లవికి ప్రస్తుతం నార్త్ లో ఎలాంటి క్రేజ్ లేదు. అందుకే సాయి పల్లవి కాకుండా బాలీవుడ్ భామని శేఖర్ కమ్ముల.. ధనుష్ కోసం తెచ్చినా మీడియా వాళ్ళు ఒప్పుకునేలా లేరు. మొత్తం మీద సాయి పల్లవి - ధనుష్ - శేఖర్ కమ్ముల మూవీ అంటూనే ప్రచారం జోరుగా సాగుతుంది.