Advertisement
Google Ads BL

చిరు థాంక్స్.. ఏపీ సీఎం.


మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఒకే రోజు ఏపీలో 13.72 లక్షల కరోనా వ్యాక్సిన్లను ఏపీ ప్రభుత్వం వేసిన సందర్భంగా చిరంజీవి ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. కరోనాను ఎదుర్కొనే క్రమంలో ముఖ్యమంత్రి కృషి అందరిలో విశ్వాసాన్ని పెంచుతోందని ఆయన ప్రశంసించారు. జగన్ నాయకత్వం స్ఫూర్తిదాయకమని చిరు ట్వీట్ చేసారు.

Advertisement
CJ Advs

చిరు జగన్ ని, ఏపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ.. ట్వీట్ చెయ్యడంతో ఇప్పుడు చిరంజీవికి జగన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ కృషికి మీరు ఇచ్చిన కితాబుకి ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఈ క్రెడిట్ అంతా గ్రామ, వార్డు వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ప్రభుత్వ డాక్టర్లు, మండల అధికారులు, జిల్లా అధికారులు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లకు చెందుతుందని తెలిపారు. ఇలా ఒకరిని ఒకరు అభినందిచుకోవటం మంచి సంప్రదాయమే.

AP CM YS Jagan reply to Megastar chiranjeevi:

AP CM YS Jagan mohan reddy reply to Megastar chiranjeevi tweet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs