Advertisement
Google Ads BL

వంశీని ఎందుకు వెయిటింగ్ లో పెట్టారు


నిన్న విజయ్ బర్త్ డే రోజున విజయ్ నెక్స్ట్, వంశి పైడిపల్లి నెక్స్ట్ పై ఓ అధికారిక ప్రకటన వస్తుంది అని టాలీవుడ్ మొత్తం ఎదురు చూసింది. వంశి పైడిపల్లి - విజయ్ - దిల్ రాజు కాంబో మూవీ సెట్ అయిన విషయాన్నీ వంశి పైడిపల్లి బయట పెట్టాడు. అయితే విజయ్ పుట్టిన రోజునాడు విజయ్ కి వంశి పైడిపల్లి, దిల్ రాజు ఇద్దరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కానీ వంశి - విజయ్ సినిమాపై అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కారణం విజయ్ నెక్స్ట్ లిస్ట్ లో వంశి లేడా? ఇప్పటికే స్క్రిప్ట్ వినిపించి వంశి.. విజయ్ ని మెప్పించడమే కాదు.. దిల్ రాజు స్టార్ హీరో విజయ్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడట. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం విజయ్ నెల్సన్ దర్శకత్వంలో బీస్ట్ మూవీ చేస్తున్నాడు. బీస్ట్ మూవీ లుక్ ఇప్పటికే అందరిని ఆకట్టుకుంది. బీస్ట్  మూవీ ప్రస్తుతం సెకండ్ వేవ్ వలన షూటింగ్ వాయిదా పడింది. జులై నుండి జార్జియాలో కొత్త షెడ్యూల్ ని మొదలు పెడతారట. అయితే బీస్ట్ తర్వాత విజయ్ చేయబోయేది వంశి పైడిపల్లి సినిమానే అని అందరూ ఫిక్స్ అయినా.. విజయ్ నుండి కానీ వంశి నుండి నిన్న విజయ్ బర్త్ డే రోజున ఎలాంటి ప్రకటన రాకపోవడం టాలీవుడ్ లో అనుమానాలు మొదలయ్యాయి. మహర్షి తర్వాత చాలారోజులుగా వంశి ఖాళీగానే ఉన్నాడు.

విజయ్ కూడా ఇప్పుడు వంశీ ని వెయిటింగ్ చేసేలా చేస్తున్నాడేమో అనే అనుమానం కలుగుతుంది. అందుకే అధికారిక ప్రకటన ఇవ్వలేదు, బీస్ట్ తర్వాత విజయ్ మరోసారి మాస్టర్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో పనిచేసే అవకాశం ఉంది.. అందుకే వంశి ని సస్పెన్స్ లో పెట్టారంటూ కోలీవుడ్ మీడియా కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. 

Vijay to team up with director Vamshi Paidipally:

Vijay and Vamshi combo: No Announcement Yet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs