ఈ ఏడాది మా ఎలక్షన్స్ పోరు మహా రంజుగా సాగేలా కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు హోరా హోరీగా పోటీ పడుతున్నారు. మంచు విష్ణు కోసం ఆయన తండ్రి మోహన్ బాబు రంగంలోకి దిగి విష్ణు కి మద్దతు కూడగడుతున్నారు. ప్రకాష్ రాజ్ కి మెగా కాంపౌండ్ అండ ఉంది అని, నాగబాబు ప్రకాష్ రాజ్ కి మద్దతుగా నిలబడ్డారు. చిరు ఎవరికి మద్దతు ఇస్తారో అనే ఆసక్తి అందరిలో ఉన్న టైం లో మా ఎలక్షన్స్ లో ఇప్పుడు మరొకరు బరిలోకి దిగబోతున్నారు. ఆమె ఎవరో కాదు జీవిత రాజశేఖర్ కూడా ఈ మా ఎలక్షన్స్ లో పోటీకి సై అంటున్నారు. గత ఏడాది మా ఎలక్షన్స్ లో నరేష్ ప్యానల్ గెలిచిన తర్వాత సీనియర్ హీరో నరేష్ తో నువ్వా - నేనా అని గొడవ పడిన రాజశేఖర్ బ్యాచ్ ఈసారి జీవితని బరిలోకి దింపబోతున్నారు.
మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ - జీవిత ల మధ్యన త్రిముఖ పోటీ ఓ రేంజ్ లో ఉండబోతుంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. మంచు విష్ణు ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ లాంటి పెద్దల సపోర్ట్ కూడగడుతున్నాడు. మరోపక్క చిరు ఫ్యామిలీతో ఉన్న తత్సంబందాలు ఈ ఎన్నికల్లో కలిసొస్తాయని చూస్తున్నాడు. నటుడు ప్రకాష్ రాజ్ తన గెలుపు ఖాయమని నమ్ముతున్నారు. మధ్యలో జీవిత కూడా ఈ పోటీలో నిలవడంతో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారతాయనడంలో సందేహం లేదు.