Advertisement
Google Ads BL

వ్యాక్సిన్ వేయించుకున్న స్టార్ కపుల్


ఈమధ్యన కరోనా వ్యాక్సిన్ వేయించుకుని.. ప్రజల్లో చైతన్యం తేవడం కోసం సెలబ్రిటీస్.. వారు వ్యాక్సిన్ వేయించుకుంటుండగా తీసుకున్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. టాలీవుడ్ లో నాగార్జున, మోహన్ బాబు, మహేష్ బాబు, మంచు లక్ష్మి ఇంకా చాలామంది వ్యాక్సిన్ వేయించుకుని వాళ్ళ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రణీత సుభాష్, బాలీవుడ్ స్టార్స్ చాలామంది కరోనా సోకకుండా వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో ఉన్నారు. ఈమధ్యన సినిమా షూటింగ్స్ మొదలు పెట్టేముందు తమ టీం లోని సభ్యులకి వ్యాక్సిన్ వేయించి మరీ సినిమా షూటింగ్స్ మొదలు పెడుతున్నారు. 

Advertisement
CJ Advs

ఇక కోలీవుడ్ లోనూ చాలామంది సెలబ్రిటీస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. కీర్తి సురేష్, నయనతార, విగ్నేష్ శివన్, వరలక్ష్మి శరత్ కుమార్, రజినీకాంత్ ఇలా చాలామంది నటులు వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఉన్నారు.

తాజాగా కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య ఆయన భార్య జ్యోతిక కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా ఫోటో షేర్ చేసారు. Sooriya Hospital లో తామిద్దరం వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా చెప్పారు. సూర్య, జ్యోతిక వ్యాక్సిన్ వేయించుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక సూర్య తన సినిమా షూటింగ్స్ లో బిజీగా వున్నాడు. జ్యోతిక కూడా తాను నటిస్తున్న సినిమా షూటింగ్స్ కోసం రెడీ అవుతుంది. సూర్య టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి తో అయినా, త్రివిక్రమ్ తో అయినా సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లుగా గత కొన్ని రోజులుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Star Couple get their vaccination:

Suriya and Jyothika get their vaccination
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs