గత ఎన్నికల్లో అమ్రావతి లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన నవనీత్ కౌర్.. ఎంపీ గా నెగ్గి లోక్‌సభలో అడుగుపెట్టింది. అయితే ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని, నవీనీతి ఎన్నిక చెల్లదంటూ శివసేన అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ జరిపి.. ఆమె తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి ఎన్నికల్లో నెగ్గింది అని.. హై కోర్టు నవనీత్ కౌర్ కి జరిమానా విధించింది. జరిమానాను రెండు వారాల్లోపు మహారాష్ట్ర న్యాయ సేవల సంస్థకు చెల్లించాలని కూడా ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆమె ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదం ఉందంటూ వార్తలు వచ్చాయి.
బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నవనీత్ కౌర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీం కోర్టు స్టే విధించింది. నవనీత్ కౌర్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. నవనీత్ కౌర్ పై న్యాయస్థానంలో పిటిషన్ వేసిన ఆనంద్‌రావ్ అద్సులేకు నోటీసులు జారీచేసింది.