ఈరోజు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టిన రోజు. కోలీవుడ్ లో విజయ్ ఫాన్స్ సంబరాలు ఆకాశాన్ని తాకాయి. విజయ్ రీసెంట్ మూవీ నుండి విజయ్ ఫాన్స్ కి కావల్సిన సర్ప్రైజ్ వచ్చేసింది. దానితో విజయ్ ఫాన్స్ ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉన్నారు. విజయ్ తాజా చిత్రాన్ని నెల్సేన్ దర్శకత్వంలో #Thalapathy65 గా చేస్తున్న విషయం తెలిసిందే. #Vijay65 లుక్ ని ఒక రోజు ముందే అంటే నిన్న సాయంత్రమే రివీల్ చేసింది చిత్ర బృందం. #Vijay65 కొత్త సినిమా టైటిల్ బీస్ట్ అంటూ ఫస్ట్ లుక్ తో పాటుగా వెంటనే సెకండ్ లుక్ ని రివీల్ చేసి ఫాన్స్ ని బిగ్ సర్ప్రైజ్ చేసారు. ఇక కోలీవుడ్ నుండి విజయ్ కి స్పెషల్ బర్త్ డే విషెస్ అందుతున్నాయి. పొలిటికల్, సినిమా ప్రముఖులు నుండి విజయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఈ ఏడాది విజయ్ కి తెలుగు నుండి కూడా స్పెషల్ విషెస్ అందాయి. మాములుగా విజయ్ నటించిన ప్రతి చిత్రం తెలుగులో డబ్ అవడమే కాదు.. ఆయన చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యి సక్సెస్ సాధించినవి ఉన్నాయి. అలాటిది ఇప్పుడు స్పెషల్ ఎందుకంటే.. విజయ్ టాలీవుడ్ డైరెక్టర్ వంశి పైడిపల్లి తో ఓ పాన్ ఇండియా మూవీ చెయ్యబోతున్నాడు. ఈమధ్యనే అధికారిక ప్రకటన వచ్చిన విజయ్ నెక్స్ట్ మూవీని టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సో అందుకు విజయ్ కి ఈసారి టాలీవుడ్ నుండి వంశీ పైడిపల్లి, అలాగే నిర్మాత దిల్ రాజు, మిగతా టాలీవుడ్ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.