Advertisement

తృతీయ కూటమి ఏర్పాటు ప్రయత్నాలు


మోడీ ప్రభుత్వానికి చెక్ పెట్టె ఏర్పాట్లు ఢిల్లీ లో జోరుగా మొదలమయ్యాయి. కేంద్రంలో బిజెపి చేసే ఆగడాలు హద్దు మీరుతున్నాయని, అలాగే కాంగ్రెస్ లో సరైన నాయకత్వం లేదని.. ఇక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యూహం సిద్ధం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీని టీఎంసీ మట్టికరిపించడం ప్రతిపక్షాల్లో ఉత్సాహాన్ని నింపింది. వచ్చే ఏడాది మరికొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా, విభిన్న రాజకీయ పార్టీలన్నీ ఒకే గొడుగు కిందికి చేరి తృతీయ కూటమిగా ఒక్కటయ్యేందుకు రెడీ అయ్యాయి. ఇందులో భాగంగా ఢిల్లీలో నేడు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఇటీవల తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాలు సంయుక్తంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలో పవార్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది.

Advertisement

ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ నేటి సమావేశంలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ఆప్ నేత సంజయ్ సింగ్, సీపీఐ నేత డి. రాజా సహా మొత్తం 15 మంది నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు యశ్వంత్ సిన్హా ఆహ్వాన లేఖలు పంపారు. వీరితోపాటు మాజీ సీఈసీ ఎస్.వై.ఖురేషి, సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి, బాలీవుడ్ ప్రముఖులు జావేద్ అఖ్తర్, ప్రీతీష్ నంది, ప్రముఖ పాత్రికేయుడు కరణ్ థాపర్ వంటి వారు కూడా ఈ సమావేశానికి హాజరవుతారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తెలిపారు.

ఇక, ఈ నెల 11న ముంబైలో శరద్ పవార్‌ను కలిసి ప్రతిపక్షాల ఏకీకరణపై చర్చించిన ప్రశాంత్‌ కిశోర్ నిన్న మరోమారు పవార్‌ను కలిసి చర్చించారు. దాదాపు గంటన్నరపాటు చర్చించారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మళ్లీ దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నాయన్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Attempts to form a Tertiary Alliance:

The meeting will be held at Pawar residence in Delhi at 4 pm
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement