Advertisement
Google Ads BL

చిరు సపోర్ట్ ఎవరికి..?


ఈ ఏడాది మా ఎలక్షన్స్ లో రసవత్తర పోరు జరగబోతుంది. నటుడు ప్రకాష్ రాజ్ - హీరో మంచు విష్ణు లు నువ్వా - నేనా అని తలపడుతున్నారు. మా అధ్యక్షుడిగా మేము మంచి చేస్తామంటే.. మేము మంచి చేస్తామంటూ ఇరు పక్షాల సభ్యులు చెబుతున్నారు. ఇక ప్రకాష్ రాజ్ కి, మంచు విష్ణు కి పొలిటికల్ అండ దండాలు బాగానే ఉన్నాయి. ఇండస్ట్రీలో చిరు లాంటి స్నేహితులు మంచు ఫ్యామిలీ కి ఉన్నారు. మా అధ్యక్ష పోటీల్లో పాల్గొంటున్నట్టుగా ప్రకటించకముందే మంచు విష్ణు సూపర్ స్టార్ కృష్ణ మద్దతు కోసం ఆయన ఇంటికి తండ్రితో కలిసి వెళ్లారు.

Advertisement
CJ Advs

మరోపక్క మెగా కాంపౌండ్ అండతోనే ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదివికి పోటీ చేస్తున్నారనే టాక్ బయటికి వచ్చింది. నటుడు నాగబాబు ప్రకాష్ రాజుకే సపోర్ట్ గా నిలబడ్డారట. మరోపక్క చిరు ఆశీస్సులు ప్రకాష్ రాజ్ కి ఉన్నాయంటున్నారు. మరి ఈమధ్యన మోహన్ బాబు తరుచూ మెగాస్టార్ ని కలవడం, ఆయన సన్ అఫ్ ఇండియా మూవీ ప్రమోషన్స్ కి చిరు ని వాడడం చూస్తున్నాం. తన స్నేహితుడు చిరు సపోర్ట్ తనకే ఉంటుంది అని మోహన్ బాబు అనుకుంటున్నారు. అంతేకాదు మంచు ఫ్యామిలీ లో జరిగే పార్టీలకు రామ్ చరణ్, మెగా ఫ్యామిలీ మెంబెర్స్ హాజరవడం, మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి మంచు ఫ్యామిలీ అటెండ్ అవడం.. ఈమధ్యన ఎక్కువగా చూస్తున్నాం. 

మరి ఇలాంటి టైం లో చిరు సపోర్ట్ ఎవరికి ఉంటుంది? ఉండబోతుంది? అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది. చిరంజీవి ఎవరికి సపోర్ట్ అందిస్తారో.. వారే ఈ ఎన్నికల్లో గెలవడం ఖాయం. ఇప్పుడు చిరు విష్ణు కి సపోర్ట్ చేస్తే ప్రకాష్ రాజ్ హర్ట్ అవుతాడు.. అదే చిరు ప్రకాష్ రాజ్ కి చెయ్యందిస్తే మోహన్ బాబు హర్ట్ అవుతారు. మరి ఇంత రసవత్తర పోరులో చిరు సపోర్ట్ ఎవరికి ఉంటుందో చూద్దాం.

To whom Chiru support?:

Whom does Chiranjeevi support in Maa elections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs