Advertisement
Google Ads BL

వివాదంలో ఇరుక్కున్న యాంకర్ ప్రదీప్


యాంకర్ ప్రదీప్ కి వివాదాలేమి కొత్తకాదు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి.. కోర్టుకి వెళ్లిన ప్రదీప్ మళ్ళీ ఇప్పుడు ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. అది ఏపీ రాజధాని విషయంలో ప్రదీప్ నోరు జారీ అమరావతి జేఏసీకి అడ్డంగా దొరికిపోయాడు. అమరావతి రాజధాని ఉద్యమం 555 రోజులుగా అమరావతి ఏరియాలో ఎంత ఉధృతంగా సాగుతుందో తెలిసిందే, ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ.. విశాఖని పరిపాలన రాజధానిగా ప్రకటించినా.. ప్రస్తుతం మూడు రాజధానుల వివాదం కేసు కోర్టులో ఉంది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం విశాఖ కి ఏ క్షణమైనా రాజధాని మార్పు ఉండొచ్చు అని చెబుతుంది. 

Advertisement
CJ Advs

ఇక అమరావతి రైతులు రాజధానిని తరలించవద్దు అంటూ ధర్నాలు చేస్తున్న టైం లో యాంకర్ ప్రదీప్ ఓ షో లో ఏపీ రాజధాని విశాఖ అంటూ వ్యాఖ్యానించడంతో ఆయనపై అమరావతి జేఏసీ ఫైర్ అయ్యింది. విశాఖ రాజధాని అంటూ ప్రదీప్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పరిరక్షక సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రదీప్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, ప్రదీప్ క్షమాపణలు చెప్పాలని.. లేదంటే హైదరాబాద్ లోని  ప్రదీప్ ఇంటిని ముట్టడిస్తామంటూ ఏపీ పరిరక్షక సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాస్ హెచ్చరించారు. మరి ఈ వివాదంపై ప్రదీప్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Amaravati JAC warns Anchor Pradeep:

Amaravati Jac Leader Fires on Anchor Pradeep
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs