Advertisement
Google Ads BL

రకుల్ బిజిపై హరీష్ శంకర్ కామెంట్స్


రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా.. బాలీవుడ్ లో బాగా బిజీగా మారిన భామ. బాలీవుడ్ లో మూడు నాలుగు బిగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న రకుల్ ని టాలీవుడ్ ని పక్కనబెట్టింది అనేది చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. రకుల్ ప్రీత్ నటించిన తెలుగు సినిమా ఒకటి ఉంది. వైష్ణవ తేజ్ - క్రిష్ కాంబోలో తెరకెక్కిన ఆ సినిమాలో రకుల్ హీరోయిన్. ఆ సినిమా రిలీజ్ అయ్యాక రకుల్ కి తెలుగులో మరో తెలుగు సినిమా లేదు. ఇదే విషయాన్నీ తరుచూ అనేక వెబ్ సైట్స్ లో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంటే.. రకుల్ మాత్రం ఏడాదికి 365 రోజులే ఉంటాయి. దానికి ఆరు సినిమాలే చెయ్యగలుగుతాము. అలా కాకుండా  ఇంకెవరైనా డేట్స్ అడ్జెస్ట్ చేసి నాకు సహాయం చెయ్యండి అంటుంది. అంతేకాని తెలుగులో అవకాశాలు రావడం లేదనేది మాత్రం రకుల్ ఒప్పుకోవడం లేదు.

Advertisement
CJ Advs

మరి రకుల్ కాస్త ఘాటుగా స్పందిస్తూ ఇలాంటి ట్వీట్ చేసింది. రకుల్ ప్రీత్ ట్వీట్ కి దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ.. రకుల్ ఎంత బిజినో నాకు తెలుసు. ఆమెతో సినిమా చెయ్యాలని.. నా ఫ్రెండ్ ఒకరు రకుల్ డేట్స్ కోసం ఎంతగా వెయిట్ చేసాడో నాకు తెలుసు.. ఆ సినిమా స్క్రిప్ట్ నచ్చినా రకుల్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడం వలన.. ఆ సినిమాని కూడా వాయిదా వెయ్యాల్సి వచ్చింది.. నువ్వు బిజీ అని చెప్పుకోవక్కర్లేదు.. నీ పనే దానికి సమాధానం చెబుతుంది అంటూ రకుల్ కి సపోర్ట్ గా హరీష్ శంకర్ రకుల్ ఎంత బిజీగా ఉంటుందో చెప్పుకొచ్చాడు.  

Harish Shankar comments on Rakul preet:

Harish Shankar: Rakul Dates or Movie Postponement 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs