కరోనా పాండమిక్ సిట్యువేషన్ అందరిని అన్నిటిని మార్చేసింది. సినిమా ఇండస్ట్రీ మరోసారి అతలాకుతలం అయ్యింది. గత ఏడాది లాక్ డౌన్ లో ఆరు నెలల పాటు షూటింగ్స్ నిలిచిపోయి సినిమాలన్నీ ఈ ఏడాదికి పోస్ట్ పోన్ అయితే.. మరోసారి ఈ ఏడాది కరోనాకి రెండు నెలలపాటు బలయ్యింది. దానితో మరోసారి సినిమా రిలీజ్ డేట్స్ మారిపోయాయి. ఇక గత రెండేళ్లుగా లాక్ డౌన్, ఇతరత్రా కారణాలతో వాయిదా పడిన ప్రభాస్ రాధేశ్యామ్ ఇప్పుడు కూడా అనుకున్న టైం రావడం కష్టమే. ఎందుకంటే ఇంకా ఓ సాంగ్ చిత్రికరణతో పాటుగా, విఎఫ్ఎక్స్ పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. జులై 30 న సినిమా విడుదలకు డేట్ ఇచ్చింది టీమ్.
ఇక కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో సినిమా షూటింగ్స్ మొదలు కాబోతున్నాయి. అందులో ప్రభాస్ రాధేశ్యామ్ కూడా ఉంది. జులై ఫస్ట్ వీక్ నుండి రాధేశ్యామ్ బ్యాలెన్స్ షూట్ మొదలు కాబోతుంది. ఓ సాంగ్ చిత్రీకరణతో పాటుగా, ఇంకొన్ని సన్నివేశాలు కూడా ఈ షెడ్యూల్ లో పూర్తి చెయ్యాలని చిత్ర బృందం చూస్తుందట. అంటే ప్రభాస్- పూజ హెగ్డే మీద సాంగ్, అలాగే మిగతా సన్నివేశాల షూట్ ని ఒకే షెడ్యూల్ లేపెయ్యబోపుతున్నారట. ఒక్కసారి మొదలైతే ఆగేదెలా అంటుందట రాధేశ్యామ్ టీం. రాధాకృష్ణ, నిర్మాతలు యూవీ వారు రాధేశ్యామ్ ని ఎలాగైనా కంప్లీట్ చేసేయాలని చూస్తున్నారట.