Advertisement
Google Ads BL

పవన్ సినిమాలో విలన్ గా నిధి


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో పిరియాడికల్ మూవీ తెరకెక్కుతుంది. హరి హర వీరమల్లు గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ దొంగలా కనిపిస్తాడని టాక్ ఉంది. పవర్ ఫుల్ లుక్ లో 3 షేడ్స్ లో పవన్ కళ్యాణ్ 33 గెటప్స్ మారుస్తాడని కాస్ట్యూమ్ డిజైనర్ చెప్పడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పుడు హీరోయిన్స్ గా నటించబోతున్న నిధి అగర్వాల్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఈ గ్లామర్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ సినిమాలో కొత్తగా కాదు సరికొత్త పాత్రలో కనిపించబోతుంది.

Advertisement
CJ Advs

నిధి చాలా స్ట్రాంగ్ పాత్రలో హరి హర వీరమల్లులో నటిస్తుందట. అంతే కాకుండా ఇందులో నిధి అగర్వాల్ పూర్తిగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందట. మరి ఎప్పుడూ గ్లామర్ పాత్రలతోనే అధరగొట్టేసే ఈ బ్యూటీ నిధి నెగటివ్ షేడ్స్ తో ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఇక బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ యువరాణిగా మెరవబోతుందట. విలన్ గా అర్జున్ రామ్ పాల్ నటిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ జులై రెండో వారం నుండి మొదలు కాబోతుంది అని తెలుస్తుంది. సెకండ్ వేవ్ వలన వాయిదా పడిన షూటింగ్.. జులై సెకండ్ వీక్ నుండి పట్టాలెక్కబోతున్నట్టుగా టాక్.

Hyderabad Hottie to cheat Power Star:

<span>Nidhi Agerwal role in Hari Hara Veera Mallu</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs