Advertisement
Google Ads BL

కొడుకుతో అలా.. తండ్రి తో ఇలా


సూపర్ స్టార్ మహేష్ బాబు తన పిల్లలని ఎంతగా ప్రేమిస్తాడో అనేది తరుచు సోషల్ మీడియాలో నమ్రత చేసే పోస్ట్ లు చూస్తేనే తెలుస్తుంది. కూతురు సితార, కొడుకు గౌతమ్ తో మహేష్ చిన్న పిల్లాడి మాదిరి ఛిల్ల్ అవుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. వాళ్ళ చిన్నప్పటినుండి మహేష్ షూటింగ్స్ లో కాస్త బ్రేక్ దొరికితే చాలు.. పిల్లలని తీసుకుని వెకేషన్స్ కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తుంటాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్.. ఫాథర్స్ డే స్పెషల్ గా తండ్రి కృష్ణ తో కలిసి ఉన్న పిక్ ని పోస్ట్ చేస్తూ My hero, guiding light, strength, inspiration.. you're all of this and much more to me. Celebrating you today and every day of the year! Happy Father's Day Nanna అంటూ తండ్రికి ఫాథర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసాడు. 

Advertisement
CJ Advs

సూపర్ స్టార్ కృష్ణ అంటే మహేష్ కి ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పుట్టిన రోజు నాడు తన సినిమాల ఫస్ట్ లుక్స్ ని అప్ డేట్స్ ని ఇచ్చే మహేష్ తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తాడు. అలాగే తన పిల్లతో బాగా ఎంజాయ్ చేసే మహేష్.. ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇక ఫాథర్స్ డే స్పెషల్ గా మహేష్ తండ్రితో ట్రెడిషనల్ గా ఉన్న పిక్ ని పోస్ట్ చేస్తే.. గౌతమ్ మాత్రం తన తండ్రి మహేష్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న పిక్ ని పోస్ట్ చేసాడు. ఆ ఫోటో చూడగానే మహేష్ ఫాన్స్ తండ్రితో అలా.. కొడుకుతో ఇలా మహేష్ నువ్ సూపర్ అంటున్నారు. 

So with the son - Like with the father:

Mahesh: Happy Fathers Day Nanna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs