Advertisement
Google Ads BL

పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్.. బాత్ టబ్ లో


రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టిన హీరోయిన్ మెహ్రీన్ గత ఏడాది డిసెంబర్ లో ఓ పొలిటిషన్ తో నిశ్చితార్ధం చేసుకుని పెళ్లి పీటలెక్కడానికి రెడీగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ వలన మెహ్రీన్ పెళ్లి పోస్ట్ పోన్ అయ్యింది కానీ.. లేదంటే ఈపాటికి మెహ్రీన్ పెళ్ళైపోయి ఓ ఇంటిదైపోయేది. భవ్య బిశ్రాయ్ తో నిశ్చితార్ధం అయ్యాక కూడా సినిమా షూటింగ్స్ కి హాజరైంది మెహ్రీన్ కౌర్. అయితే పెళ్లయ్యాక మెహ్రీన్ సినిమాలు వదిలేస్తుంది అనే అనుకున్నారు. కానీ మెహ్రీన్ మాత్రం సినిమాలకు దూరమవనని, పెళ్లి తో పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయినా.. కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టను అన్నట్లుగా సినిమాలు ఒప్పుకుంటుంది. ప్రస్తుతం ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 లో నటిస్తున్న మెహ్రీన్ కౌర్ పెళ్లి కోసం వెయిట్ చేస్తుంది.

Advertisement
CJ Advs

త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న మెహ్రీన్ కౌర్ ఇప్పుడు బాత్ టబ్ లో దర్శనమిచ్చింది. ఎల్లో కలర్ డ్రెస్ లో మెహ్రీన్ కౌర్ బాత్ టబ్ లో చాలా చక్కని ఫోజు ఇచ్చింది. బాత్ టబ్ లో కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న మెహ్రీన్ కౌర్ ఆ ఎల్లో కలర్ డ్రెస్ లో మెరిసిపోతుంది. పెళ్లికళ కొట్టచ్చినట్టుగా కనబడుతున్న మెహ్రీన్ కౌర్.. ఈమధ్యన చాలా సన్నబడి నాజూగ్గా తయారయ్యింది. ఒకప్పుడు బొద్దుగా బబ్లీగా ఉండే మెహ్రీన్ కౌర్ పెళ్లి అనుకున్నాక చాలా సన్నగా తయారయ్యింది. ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ఎఫ్ 3 సినిమా ఉంది. త్వరలోనే మెహ్రీన్ ఎఫ్ 3 షూటింగ్ కోసం హైదరాబాద్ కి రాబోతుంది.

Mehreen Pirzada latest pic viral:

Mehreen kaur latest pic viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs