Advertisement
Google Ads BL

అఖండకి ఆ డేట్ ఖాయమేనా


బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న అఖండ మూవీపై భారీ అంచనాలున్నాయి. బోయపాటి బాలయ్యని పవర్ ఫుల్ అఖండ గా చూపించబోతున్నాడు. అఖండ పాత్రలో బాలయ్య చెప్పే డైలాగ్స్ కి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని, అఘోర కేరెక్టర్ జస్ట్ కేరెక్టర్ కాదు.. చాలా ఉన్నతమైన పాత్ర అంటూ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న హీరో శ్రీకాంత్ అఖండ పై హైప్ క్రియేట్ చేసాడు. ఇక కరోనా సెకండ్ వేవ్ వలన ఆగిన షూటింగ్ ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో మొదలు కాబోతుంది. జులై ఫస్ట్ వీక్ నుండి ఓ పాటతో పాటు కొన్ని కీలక యాక్షన్‌ సన్నివేశాలు తెర కెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
CJ Advs

ఇక బాలకృష్ణ డ్యూయెల్ రోల్ పోషిస్తున్న అఖండ మూవీ మే 28 నే రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. ఇప్పుడు కరోనా వలన అది పోస్ట్ పోన్ అయ్యింది. అయితే అఖండ కి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించడానికి మూవీ యూనిట్ రెడీ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. అది వినాయక చవితి పర్వదినాన అఖండ మూవీ ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో టీం ఉందట. అన్ని అలోచించి ఆ డేట్ ని ప్రకటించబోతున్నారట. మరి వినాయక చవితికి ఈసారి చాలా సినిమాల పోటీ ఉంటుంది. ఎందుకంటే గత రెండు నెలలుగా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ ఇప్పుడు ఆగష్టు దారే పడుతున్నాయి. 

Akhanda to Release for Vinayaka Chavithi:

Balayya - Boyapati Akhanda to Release for Vinayaka Chavithi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs