Advertisement
Google Ads BL

సలార్ కి దిమ్మతిరిగే డీల్


ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. కెజిఎఫ్ తో కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజ్ పాన్ ఇండియా మార్కెట్ దద్దరిల్లింది. ఈ ఇరువురి కలయికలో వస్తున్న సలార్ మూవీకి పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ప్రభాస్ సలార్ లో మాస్ లుక్ లో కనిపించి అంచనాలు పెంచేసాడు. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. అయితే ఈ సినిమా లో ప్రభాస్ సోషల్ కాన్సెప్ట్‌తో సామాన్యుల హక్కుల పోరాడే ఒక పవర్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో కనిపించనున్నాడట. ప్రభాస్ మాస్ స్టయిల్ కి మాస్ డైరెక్టర్ తోడైతే.. బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే అన్నట్టుగా ఈ సినిమా ఉండబోతుందట.

Advertisement
CJ Advs

ఈ క్రేజీ ఫిలిం కి ఇప్పుడొక భారీ డీల్ సెట్ అయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఓటిటి నెంబర్ వన్ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తం ఆఫర్ చేసారని.. సలార్ అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులకు గాను 100 కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అది కూడా థియేట్రికల్ రన్ పూర్తయ్యాకే అంటున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా అప్పీల్ ఆ రేంజ్ లో ఉంది. అందుకే ఈలాంటి భారీ ఆఫర్ సలార్ కి దక్కింది అంటున్నారు ప్రభాస్ ఫాన్స్. ప్రభాస్ వరస పాన్ ఇండియా మూవీస్ రేంజ్ కూడా అలానే ఉంది.. కాబట్టే సలార్ కి ఇంత భారీ ఆఫర్ అంటున్నారు. ప్రస్తుతం అమెజాన్ అయితే డీల్ గురించి చర్చించింది. కానీ సలార్ నిర్మాతలే ఓ డెసిషన్ కి రాలేదంటున్నారు.

Amazon Prime tempts Salaar with a fancy deal :

Salaar: Amazon Prime Video Offers Massive Deal
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs