గురువారం వచ్చింది అంటే జబర్దస్త్ స్టేజ్ మీద అనసూయ అదిరిపోయే స్టెప్స్ తో పాటుగా అనసూయ అందాలకు యూత్ ఫిదా అవుతుంటారు. కామెడీ ప్రియులకి జబర్దస్త్ స్కిట్స్ లో కామెడీ ఎంత ఇంపార్టెంటో అనసూయ డాన్స్, ఆమె యాంకరింగ్ అంత ఇంపార్టెంట్ అనేలా ఉంటుంది. సోషల్ మీడియాలో అనసూయ స్పెషల్ photo షూట్స్ మాములుగా ఉండవు. అనసూయ డ్రెస్సులు, ఆమె మాటకారి తనం అన్ని అద్భుతమే అన్నట్టుగా చూసేవాళ్ళు ఉన్నారు.. అనసూయ వేసుకునే చిట్టి పొట్టి డ్రెస్సు లపై కామెంట్స్ చేసే నెటిజెన్స్ కూడా ఉన్నారు. తనని కామెంట్ చేసే వారి తాట తీసే అనసూయ కి జబర్దస్త్ స్టేజ్ మీద ఘోర అవమానమే జరిగింది.
అది వచ్చే గురువారం ఎపిసోడ్ కి ఆది స్కిట్ లో యూట్యూబ్ యాంకర్ శివ గెస్ట్ గా వచ్చాడు. శివ తో ఆది స్కిట్ చేసాడు. ఆ స్కిట్స్ ఆద్యంతం బాగానే ఉన్నట్టుగా ప్రోమోలో చూపించారు. ఇక ఆ ఈ ప్రోమో చివర్లో అనసూయను యాంకర్ శివ చిన్న ప్రశ్న అడుగుతానంటూ.. అనసూయ డ్రెస్‌ల గురించి కామెంట్ చేసాడు. చిన్న చిన్న బట్టలు ఎందుకు వేసుకుంటారు అని చాలా కామెంట్లు వస్తుంటాయి. దీనిపై మీరేమంటారు. వాళ్లకంటే తెలియదు. మీరు ఇండస్ట్రీలో ఉంటూ ఇలా అడుగుతారా. అది నా పర్సనల్ అంటూ అనసూయ గట్టిగానే స్పందించింది.
పర్సనల్ అయితే ఇంట్లో వేసుకోవచ్చు కదా అంటూ శివ అడిగేసరికి అనసూయ రుసరుసలాడుతూ ఇలాంటి వాళ్ళని షోకి ఎందుకు తీసుకువస్తారో అంటూ స్టేజ్ దిగి వెళ్ళిపోయింది. అన్ని తెలిసే జరుగుతున్నాయంటూ అనసూయ స్పందన చూస్తే అక్కడేదో జరిగినట్టుగా క్రియేట్ చేసారు. మరి షో మీద హైప్ క్రియేట్ చెయ్యడానికి అలా చూపించారా? లేదంటే నిజంగానే అనసూయ అవమానంగా ఫీలయ్యిందో? అంటూ ఇప్పుడు నెటిజెన్స్ తెగ ఆలోచించేస్తున్నారు. మరి ఈ సస్పెన్స్ వచ్చే గురువారం కాని రివీలవ్వదు..