Advertisement
Google Ads BL

కమ్ములతో మూవీ.. ఎగ్జైట్ అవుతున్న ధనుష్


నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్స్ సూప‌ర్‌స్టార్ ధ‌నుష్‌, సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కాంభినేష‌న్‌లో తమిళ, తెలుగు మరియు హిందీ భాషలలో ఒకేసారి మూవీని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ లో ఈ మూవీకి నారాయణ్ దాస్ కె నారంగ్ - పుస్కూర్ రామ్ మోహన్ రావు లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. త్రిభాషా చిత్రంగా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కనుంది.

Advertisement
CJ Advs

అయితే ప్రస్తుతం హాలీవుడ్ మూవీ షూటింగ్ కోసం అమెరికాలో ఉన్న ధనుష్.. ఈ క్రేజీ మూవీ ప్రకటనపై ట్వీట్ చేసాడు. నేను ఎంతో ఇష్ట‌ప‌డే ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన‌ శేఖ‌ర్ క‌మ్ముల గారితో క‌లిసి వ‌ర్క్ చేసేందుకు ఎగ్జ‌యిటెట్ గా ఉన్నా అంటూ ట్వీట్ చేసాడు ధ‌నుష్‌. దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాతలు నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావులతో కలిసి పనిచేసినందుకు ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్న‌ట్లు ధ‌నుష్ తెలిపారు. ఇక ఈ సినిమా కోసం దేశంలోనే అత్యున్న‌త‌మైన న‌టులు, టెక్నీషియ‌న్స్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది చిత్ర యూనిట్‌. త్వ‌ర‌లోనే వారి వివ‌రాలు ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభంకానున్న ఈ ప్రాజెక్ట్ యొక్క మ‌రిన్ని వివరాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

I admire Sekhar Kammula says Dhanush:

Sekhar Kammula and star hero Dhanush movie was announced
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs