Advertisement
Google Ads BL

ఆచార్య లో చందమామ లుక్


ఈ రోజు కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకి సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఆమెతో కలిసి పని చేసిన కో స్టార్స్, దర్శకులు, నిర్మాతలు, ఆమె ఫ్రెండ్స్, తోటి హీరోయిన్స్ అందరూ కాజల్ కి స్పెషల్ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కాజల్ అగర్వాల్.. గత ఏడాది పెళ్లి చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్, లవర్ గౌతమ్ కిచ్లు ని లాక్ డౌన్ ప్రభావంతో చాలా సింపుల్ గా వివాహం చేసుకుంది. ఆ తర్వాత హాని మూన్ అని ఓ పది రోజుల పాటు మాల్దీవుల్లో రచ్చ చేసిన కాజల్ అగర్వాల్.. వెంటనే ఆమె నటిస్తున్న ఆచార్య మూవీ సెట్స్ లో వాలిపోయింది. ప్రస్తుతం, సీనియర్ హీరోలకి పరిమితమవుతున్న కాజల్ అగర్వాల్.. చిరు, నాగ్ లతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

Advertisement
CJ Advs

ఆచార్య మూవీలో కాజల్ అగర్వాల్ ఎలా కనిపిస్తుందో.. ఎలాంటి లుక్ లో కాజల్ ని చూపిస్తారో అని ఆమె ఫాన్స్ తెగ ఇదైపోయారు. మొన్నామధ్యన ఆచార్య నుండి విడుదలైన సాంగ్ లో కాజల్ పాప లంగా వోణిలో అందంగా కనిపించింది. ఇటు చిరు చూస్తే రఫ్ గా ఆచార్య లుక్ లో కనిపిస్తున్నాడు. అలాంటి డీ గ్లామర్ రోల్ ఏమైనా కాజల్ ఆచార్యలో పోషిస్తుందేమో అనుకుంటే.. కాజల్ అగర్వాల్ లంగా వోణిలో ముద్దబంతి లా మెరిసిపోతుంది. ఈ రోజు కాజల్ పుట్టిన రోజు సందర్భంగా ఆచార్య టీం నుండి ఆమెకి లుక్ తో పాటుగా స్పెషల్ విషెస్ అందాయి. ఆచార్య లో కాజల్ లంగా వోణి లో సంప్రదాయంగా, అందంగా చేతినిండా గాజులతో, లూజ్ హెయిర్ తో, తలలో పువ్వులతో.. లంగా ఓణీ గెటప్ లో కాజు పాప అదిరిందిగా అంటున్నారు. ఆచార్య లో కాజల్ లుక్ తో మెగా ఫాన్స్ కూడా హ్యాపీ.

Acharya Movie Kajal Aggarwal Look :

Team Acharya wishes the gorgeous & supremely talented Kajal Aggarwal a very Happy Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs