సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యకారణాల దృష్యా అమెరికా వెళ్లాల్సి ఉండగా.. కోవిడ్ సెకండ్ వేవ్ వలన ఆయన అమెరికా ప్రయాణం పోస్ట్ పోన్ అయ్యింది. మే నెలలోనే రజినీకాంత్ అమెరికా వెళ్లాల్సి ఉంది. దాని కోసమే రజినీకాంత్ తాను నటిస్తున్న అన్నాత్తే సినిమా షూటింగ్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఏకధాటిగా పూర్తి చేసేసారు. ఆయన అమెరికా వెళ్లే టైం కి సెకండ్ వేవ్ వలన ఆయనకి పర్మిషన్ లభించలేదు. కానీ రీసెంట్ గా ఆయన ఫ్యామిలీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రజినీకాంత్ ఆరోగ్యం దృష్యా హెల్త్ చెకప్ చేయించుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరగా.. కేంద్రం నుండి రజిని అమెరికా వెళ్లేందుకు పర్మిషన్ దొరికింది.
14 మంది ఉండే స్పెషల్ ఫ్లైట్ లో రజినీకాంత్ అమెరికా వెళ్లేందుకు పర్మిషన్ దొరికింది. దానితో సూపర్ స్టార్ ఫ్యామిలీ మెంబెర్స్ తో రజినీకాంత్ నేటి ఉదయం అమెరికా వెళ్లేందుకు చెన్నై ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. ఆయన చెన్నై ఎయిర్ పోర్ట్ నుండి అమెరికాకి ఈ ఉదయమే బయలుదేరివెళ్లారు. అయితే రజినీకాంత్ ఆరోగ్యపరమైన కారణాలతో అమెరికా వెళ్లారని.. ఆయన ఆరోగ్యంపై ఫాన్స్ ఆందోళన పడుతున్నారు. కానీ రజినీకాంత్ మాత్రం రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే అమెరికా వెళ్తున్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇక రజినీకాంత్ పెద్దల్లుడు ధనుష్ ఫ్యామిలీతో కలిసి ఓ హాలీవుడ్ ఫిలిం కోసం అమెరికాలో ఉన్నారు. రజినీకాంత్ అమెరికా వెళ్ళగానే ధనుష్ అండ్ ఫ్యామిలీ కూడా రజినీకాంత్ తో కలిసి ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.