అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా ఫిలిం గా రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న పుష్ప సినిమా షూటింగ్ అప్పుడే 80 శాతం పూర్తయ్యింది. కోవిడ్ సెకండ్ వేవ్ వలన షూటింగ్ ఆగింది కానీ లేదంటే ఈపాటికి షూటింగ్ ఫినిష్ చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ లో టీం తలమునకలయ్యేది. అయితే ఈ నెల చివరి వారం నుండి పుష్ప మిగతా షూటింగ్ పూర్తి చెయ్యడానికి టీం సన్నద్ధమవుతోంది. మలయాళం నుండి ఫహద్ ఫాజిల్ ఎప్పుడు వస్తే అప్పుడు షూటింగ్ మొదలెట్టేస్తారు. ఈ సినిమాలో ఫహద్ విలన్ గా నటించబోతున్నాడు.
అయితే పార్ట్ 1 లోనే ఫహద్ ఫాజిల్ పాత్రని ముగించెయ్యబోతున్నారనే టాక్ నడుస్తుంది. అంటే పుష్ప పార్ట్ 1 క్లయిమాక్స్ లోనే ఫహద్ కేరెక్టర్ కి ముగింపు ఇవ్వబోతున్నారట. ఫారెస్ట్ ఆఫీసర్ గా ఫారెస్ట్ లో ఎవరికీ తెలియని రాజకీయాలు చేస్తూ.. అక్కడ స్మగ్లింగ్ కింగ్ గా ఫహద్ కనిపిస్తాడని.. ఆ పాత్ర ని పార్ట్ వన్ లోనే చంపెయ్యబోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చింది. మరి పార్ట్ వన్ లో ఫహద్ పాత్ర ముగించేస్తే.. పార్ట్ 2 లో సుక్కు ఏం చూపిస్తాడో.. అంటే మరో విలన్ ని ఎమన్నా దింపుతాడేమో అంటున్నారు. హీరోయిన్ రష్మిక మాత్రం తాను పుష్ప రెండు పార్ట్ ల్లో కనిపిస్తానని క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ నుండి అనసూయ, జగపతి బాబు వంటి వారు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.