Advertisement
Google Ads BL

ధనుష్ కోసం ఆ హీరోయిన్ దిగుతుందా


ఎవరు ఊహించని కాంబో సెట్ అయ్యింది. అది టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కోలీవుడ్ మాస్ హీరో ధనుష్ మధ్య మూవీ సెట్ అవడం. ఈ కాంబోని ఎవరూ ఊహించనైననూ లేదు. ధనుష్ ఎప్పటినుండో తెలుగు సినిమా చేస్తాడని అంటున్నారు. ఇక శేఖర్ కమ్ముల నెక్స్ట్ హీరో పై చిన్న ఇన్ఫోర్మేషన్ కూడా లేదు. కానీ ఉన్నట్టుండి ఈ కాంబోలో మూవీ సెట్ అవడమే.. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మరి ప్రేమ కథలకి పెట్టింది పేరు శేఖర్ కమ్ముల.. ఆయన ధనుష్ తో మాస్ మూవీ తీస్తాడా? లేదంటే క్లాస్ ఆడియన్స్ మెచ్చే మూవీ చేసి మూడు భషాల్లోకి వెళతాడా? ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్నలు.

Advertisement
CJ Advs

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా బ్యాక్ డ్రాప్ గురించి పక్కనపెడితే.. ఇప్పుడు ఈ సినిమాలో ధనుష్ సరసన నటించబోయే హీరోయిన్ విషయం చర్చకు వచ్చింది. అంటే శేఖర్ కమ్ముల గత రెండు సినిమాల నుండి మలయాళ బ్యూటీ సాయి పల్లవినే రిపీట్ చేస్తున్నాడు . ఫిదా, లవ్ స్టోరీ అంటూ సాయి పల్లవి ని వదలడం లేదు. మరోపక్క ధనుష్ తో సాయి పల్లవి మారి 2 లో కోలీవుడ్ లో నటించింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా వాళ్ళ కాంబోలో తెరకెక్కిన మరి 2 సాంగ్ ఇప్పటికి యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. సో ఇప్పుడు శేఖర్ కమ్ముల ధనుష్ తో చెయ్యబోయే మూవీ కోసం సాయి పల్లవిని.. రిపీట్ చేస్తాడా? లేదంటే హిందీ భామని తీసుకొస్తాడో చూడాలి.

Sai Pallavi To Romance Danush Again?:

Sai Pallavi To Romance Danush Again in Sekhar Kammula Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs