Advertisement
Google Ads BL

ఏపీ కర్ఫ్యులో సడలింపులు


ఏపీలో కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నాయి. మే మూడు నుండి ఏపీలో 18 గంటల కర్ఫ్యూని అమలు చేసింది జగన్ ప్రభుత్వం. ఉదయం ఆరు గంటల నుండి మధ్యాన్నం 12 గంటల వరకు ఆంక్షలు సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత సమయంలో కఠినంగా కర్ఫ్యూని అమలు చేసింది. ఇక జూన్ 10 నుండి ఆ కర్ఫ్యులో సడలింపులు ఇచ్చింది. అందులో భాగంగా ఉదయం ఆరు నుండి మద్యాన్నం 2 గంటల వరకు ఆంక్షల సడలింపులు ఇవ్వగా.. ఇప్పుడు ఆ కర్ఫ్యూ సమయం ముగిసింది.

Advertisement
CJ Advs

కరోనా కేసులు తగ్గుదలతో కర్ఫ్యూ ఆంక్షల సడలింపులు సమయాన్ని పెంచింది ఏపీ ప్రభుత్వం. ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు సడలింపులు అమలులో ఉంటాయని, ఆ తర్వాత కఠినంగా కర్ఫ్యూ అమలవుతుంది అని.. ఈ సడలింపులు జూన్ 21 నుండి అమములోకి వస్తాయని జగన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం ఆరు నుండి సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరుచుకోవ‌డానికి అనుమతి ఉంటుంద‌ని, మ‌రో గంట సేప‌ట్లో దుకాణాల సిబ్బందికి ఇంటికి వెళ్లేందుకు స‌మ‌యం ఉంటుంద‌ని చెప్పారు. 

అయితే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఈస్ట్ గోదావరిలో మాత్రం ఉద‌యం 6 గంట‌ల‌ నుంచి మధ్యాహ్నం 2 గంట‌ల‌ వరకే సడలింపు ఉంటుంద‌ని.. ఈ కర్ఫ్యూ జూన్ 30 వరకులు అమలులో ఉంటుంది అని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.

Ap curfew extension:

Andhra Pradesh curfew extension till June 30
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs