ఇప్పుడు ఏ భాష డైరెక్టర్స్ అయినా.. తమ భాషల హీరోలతోనే కాకుండా ఇతర భాషలు హీరోలతో కమిట్ అవుతున్నారు. నిన్నటివరకు టాలీవుడ్ హీరోలే పర భాష దర్శకుల వెంట పడ్డారనుకున్నారు. ఇప్పుడు పర భాషా దర్శకులు టాలీవుడ్ హీరోల వెంట పడడమే కాదు.. టాలీవుడ్ దర్శకులు కూడా పక్క భాషా హీరోలతో సినిమాలు చెయ్యడానికి సిద్ధమైపోయారు. అలాంటి కమిట్మెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో కోకొల్లలు. ముందుగా ప్రభాస్ బాలీవుడ్ దర్శకులు ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. అలాగే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ సెట్ చేసుకున్నాడు. ఇంకో హిందీ డైరెక్టర్ ప్రభాస్ లిస్ట్ లో ఉన్నాడు. ఇక రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిలిం ప్రకటించాడు. మరోపక్క ఎన్టీఆర్ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మూవీ అనౌన్స్ చేసాడు.
ఇక రీసెంట్ గా కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ దర్శకులపై కన్నేశారు. అందులో భాగంగానే టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లితో తమిళ స్టార్ హీరో విజయ్ పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక బోయపాటి తో సూర్య ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. అలాగే తాజాగా కోలీవుడ్ హీరో ధనుష్ టాలీవుడ్ శేఖర్ కమ్ములతో సినిమా ప్రకటించి ఆశ్చర్య పరిచారు. అసలు చిన్న క్లూ కూడా లేకుండా శేఖర్ కమ్ముల - ధనుష్ మూవీ సెట్ కావడం, మూడు భషాల్లో ఈ సినిమా తెరక్కబోతున్నట్లుగా ప్రకటించడం ఫాన్స్ కి షాకిచ్చింది. మరి ఇప్పడు ఏ భాషా దర్శకులైన తమ కథకి సూట్ ఏ భాష హీరో ని అయినా సెట్ చేసుకునే రేంజ్ కి దర్శకుల ఆలోచనలు మారిపోయాయి.