దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు అదుపులోనే ఉంటున్నాయి. మరణాలు కూడా తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కలిగిస్తోంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 62,480 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. నిన్నటి తో పోల్చితే కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 2.97కోట్లకు చేరాయి.
ఇక రోజువారీ కరోనా మరణాల్లో చాలా రోజుల తర్వాత తగ్గుదల నమోదైంది. 24 గంటల వ్యవధిలో 1,587 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 18 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక ఇప్పటివరకు 3,83,490 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 8లక్షల దిగువకు చేరింది.