Advertisement
Google Ads BL

విజయ్ బర్త్ డే ట్రీట్


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది మాస్టర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సంక్రాంతికి విడుదలైన మాస్టర్ సినిమా తమిళ్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. తెలుగులో సో సో గానే ఆడినా.. విజయ్ సేతుపతి - విజయ్ కాంబో అనగానే ఇక్కడా బాగా క్రేజ్ వచ్చేసింది. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో మాస్టర్ గా విజయ్, విలన్ గా సేతుపతి నువ్వా - నేనా అని ఢీ కొట్టారు. ఇక మాస్టర్ తర్వాత విజయ్ నెల్సన్ డైరెక్షన్ లో #Thalapathy65  చేస్తున్నాడు. ఈ సినిమాలో సౌత్ బ్యూటీ పూజ హెగ్డే విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. సెకండ్ వేవ్ వచ్చేముందు వరకు ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరిగింది.

Advertisement
CJ Advs

అయితే సెకండ్ వేవ్ ఉధృతితో Vijay65 షూటింగ్ కూడా ఆపేసారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుంది అని సమాచారం. ఇంతలోనే Thalapathy65 ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించింది టీం. జూన్ 22 విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఒకరోజు ముందే అంటే జూన్ 21 సాయంత్రం 6 గంటలకు #Thalapathy65 ఫస్ట్ లుక్ ని రివీల్ చెయ్యబోతున్నట్టుగా అధికారిక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన చూసిన విజయ్ ఫాన్స్.. సెకండ్ వేవ్ సిట్యువేషన్ అయినా.. విజయ్ బర్త్ డే ట్రీట్ వచ్చేస్తుంది అంటూ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

Thalapathy 65: First Look To Release On June 21?:

Thalapathy Vijay birthday treat for fans is ready
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs