ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి మహారాష్ట్ర ప్రభుత్వం శివ సేనకు మధ్యన పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది. ఏదైనా మొహం మీదే మాట్లాడే కంగనా రనౌత్ బిజెపి కి వకాల్తా పుచ్చుకుని శివసేన ప్రభుత్వంపై ఒంటికాలిపై వెళుతుంది. తాజాగా ఆమె ని విదేశీ షూటింగ్స్ కి వెళ్లకుండా పాస్ పోర్ట్ వెరిఫికేషన్ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారంటూ మహారాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతుంది. ఆమె లేటెస్ట్ మూవీ తేజస్ షూటింగ్ కోసం కంగనా హంగేరిలోని బుడాపెస్ట్‌కు వెళ్లాల్సి ఉండగా.. కంగానా పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కోసం ముంబయిలోని పాస్‌పోర్టు కేంద్రానికి వెళ్లగా అక్కడ పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి అయ్యింది. కానీ కంగనాపై పోలీస్ స్టేషన్ లో దేశద్రోహం కేసు ఉండడంతో పోలీస్ లు అభ్యంతరం చెప్పారు.
కానీ కంగనా తాను షూటింగ్ నిమిత్తం విదేశాలకి వెళ్లాల్సి ఉంది అని ముంబయి హైకోర్టును ఆశ్రయించింది. కానీ హై కోర్టులోనూ కంగనా చేసిన దరఖాస్తు అస్పష్టంగా ఉందని చెప్పడం.. కేసుని జూన్25 కి వాయిదా వేసింది కోర్టు. దానితో కంగనా మహారాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడింది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మహావినాశకారి ప్రభుత్వం అంటూ సంభోదిస్తూ.. నన్ను పరోక్షంగా వేధింపులకు గురిచేస్తోంది. గతంలో నా ఆఫీస్ ని కూలదోయించిన మహా సర్కారు ఇప్పుడు ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి నాపై పెట్టిన కేసు కారణంగా నా పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు అధికారులు వేధిస్తున్నారు. అటు హైకోర్టుకు వెళ్తే.. నా అప్లికేషన్ అస్పష్టంగా ఉందని పేర్కొంటూ జూన్ 25కి విచారణ వాయిదా వేసింది.. అదే మరో అగ్ర హీరో ఇండియా ని దూషిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా.. ఆయన పాస్ పోర్ట్ ని నిలిపివెయ్యలేదు అంటూ మహా సర్కార్ పై కంగనా చిందులు తొక్కుతుంది.