Advertisement
Google Ads BL

రవితేజ - రాయలసీమ భాష


కొన్నాళ్లుగా ప్లాప్స్ లో ఉన్న రవితేజ కి క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడంతో మరోసారి దూకుడు పెంచాడు. క్రాక్ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ రమేష్ వర్మతో ఖిలాడీ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా మే 29 నే విడుదల కావాల్సి ఉండగా.. సెకండ్ వేవ్ అడ్డం పడడంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. అలాగే సినిమా షూటింగ్ కూడా కొంతమేర బ్యాలెన్స్ ఉండిపోయింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కోసం టీం జూన్ 24 తర్వాత ఇటలీ పయనమవుతున్నట్లుగా టాక్. ఇకపోతే ఆ సినిమా తర్వాత రవితేజ కొత్త దర్శకుడు శరత్ మండవ తో సినిమా చెయ్యబోతున్నాడు.

Advertisement
CJ Advs

ఇప్పుడు ఆ సినిమా కోసమే రవితేజ రాయలసీమ స్లాంగ్ మాట్లాడబోతున్నాడట. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రవితేజ కేరెక్టర్ కొత్తగా ఉండడమే కాదు.. రాయలసీమ భాషలో ఇరగదీస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది అని.. పాతికేళ్ల క్రితం జరిగే కథ ఇది అని అప్పటి పరిస్థితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది అని చెప్పడమే కాదు ఈ సినిమాలో రవితేజ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. మరి రవితేజ రాయలసీమ భాషలో భారీ డైలాగ్స్ తో విలన్స్ కి ఎలా చుక్కలు చూపిస్తాడో చూడాలి.

Raviteja to surprise in Rayalaseema slang?:

Raviteja teaming with Sarath Mandava
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs