Advertisement
Google Ads BL

కవిత కొడుకు మృతి.. హాస్పిటల్ లో భర్త


కరోనా తో ఎంతోమంది సెలబ్రిటీస్, ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఫస్ట్ వేవ్ కన్నా ఎక్కువగా.. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది హాస్పిటల్ పాలయ్యారు. తాజాగా  సీనియర్ నటి కవిత ఇంట్లో కరోనా విషాదాన్ని నింపింది. ఆమె భర్త కరోనా కారణంగా హాస్పిటల్ లో ఉండగా.. కవిత కొడుకు సంజయ్ రూప్ కరోనా కారణంగా ప్రాణాలు విడవడంతో కవిత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొన్నిరోజుల క్రితం సంజయ్ రూప్‌కు కోవిడ్ లక్షణాలను ఉండడంతో టెస్ట్ చేయగా.. పాజిటివ్ అని వచ్చింది. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత సంజయ్ కొన్నాళ్ళు హోం క్వారంటైన్‌లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. తర్వాత ఆయన  పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు. మరోపక్క కవిత భర్త దశరథ రాజు కరోనా కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కవిత కొడుకు సంజయ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Kavitha son dies of Covid19:

Kavitha son dies of Corona, Kavitha Husband Hospitalised
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs