ఏప్రిల్ 16 న విడుదల కావల్సిన శేఖర్ కమ్ముల - నాగ చైతన్య లవ్ స్టోరీ మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగానూ, థియేటర్స్ లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ కారణంగానూ రిలీజ్ వాయిదా వేసింది టీం. గత రెండు నెలలుగా కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కాస్త తగ్గుముఖం పట్టడంతో తెలంగాణాలో జులై 1 నుండి 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ మీద థియేటర్స్ ఓపెన్ చేయబోతుంది. వెంటనే కాకుండా కొన్ని రోజులు ప్రేక్షకుల స్పందన చూసి సినిమా రిలీజ్ డేట్స్ ఇచ్చే ప్లాన్ లో దర్శకనిర్మాతలు ఉన్నారు.
అందులో ముందుగా వెంకటేష్ నారప్ప పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా హింట్ ఇచ్చారు. తాజాగా నాగ చైతన్య లవ్ స్టోరీ పై దాదాపుగా క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తుంది. అది జులై లో థియేటర్స్ ఆక్యుపెన్సీ చూసాక ఆగస్టు లో లవ్ స్టోరీ విడుదల చెయ్యాలని అనుకుంటున్నారట దాని కోసం ఆగష్టు 13 కానీ, లేదంటే ఆగష్టు 27 న కానీ విడుదల చెయ్యాలని భవిస్తున్నారట. నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది త్వరలోనే టీం అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది.