కొన్ని రోజుల క్రితం నరసాపురం ఎంపి రఘురామకృష్ణరాజు ని ఏపీ సిఐడి పోలీస్ లు అరెస్ట్ చేసి గుంటూరు జైలుకి తరలించడం, ఆయన సుప్రీం కోర్టునుండి బెయిల్ తెచ్చుకోవడం అన్ని తెలిసిన విషయమే. ఆయన్ని అరెస్ట్ చెయ్యడం, ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలన్ని అందరికి తెలిసిందే. ఇక రఘురామకృష్ణరాజు బెయిల్ పై బయటికొచ్చినాక కూడా ఏపీ సీఎం జగన్ కి రోజుకో లేక రాస్తూ హడావిడి చేస్తున్నారు. అంతేకాకుండా నేడు పీఎం మోడీకి కి తనకి జరిగిన అన్యాయంపై లేఖ రాసారు. మరోపక్క వైసిపి కూడా ఆయన్ని వదలడం లేదు. ఇక తాజాగా తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు సాక్షి మీడియాకు రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులిచ్చారు.
తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బేషరతు క్షమాపణ చెప్పాలని ఆయన సాక్షికి ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. పదిహేను రోజుల్లో నోటీసుకు సమధానం ఇవ్వకుంటే.. 50 కోట్ల పరువునష్టం దావా దాఖలు చేస్తామని రఘురామ హెచ్చరించారు. గతంలో కూడా సాక్షి టీవీ చానల్‌కు రఘురామ లీగల్ నోటీస్ ఇచ్చారు. రఘురామరాజు తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర ఈ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా తనకు వ్యతిరేకంగా, న్యాయవిరుద్ధంగా అనేక కథనాలు ప్రసారం చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, వారం రోజుల్లోగా స్పందించకుంటే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.