ఏపీలో ప్రస్తుతం 16 గంటల కర్ఫ్యూ నడుస్తుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కొన్ని సడలింపులతో కర్ఫ్యూని అమలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం.. జూన్ 20వరకూ కర్ఫ్యూ ఉంటుందని.. జూన్ 20 తర్వాత కూడా కర్ఫ్యూ కొనసాగుతుంది అని చెబుతున్నారు. తాజాగా జరిగిన మీటింగ్ లో జగన్.. జూన్ 20 తర్వాత కర్ఫ్యూ లో కొన్ని సడలింపులు ఇవ్వాల్సి ఉంటుంది అని క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.. దానితో పాజిటివిటీ రేటు తగ్గుముఖం పడుతోందని.. అయిన్నప్పటికీ కర్ఫ్యూ కంటిన్యూ చేస్తామని.. అయితే జూన్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఉంటాయని స్పష్టం చేసారు.
ఏపీలో పిల్లల వైద్యం కోసం 3 అత్యాధునిక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నట్టు.. వారానికి ఒకసారి ఫీవర్ క్లినిక్స్ కూడా కచ్చితంగా నిర్వహించాలి అని.. థర్డ్‌వేవ్ వస్తుందో, లేదో మనకు తెలియదు. కానీ మనం మాత్రం ప్రిపేర్‌గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశం.. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే దానిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. థర్డ్‌వేవ్‌లో పిల్లలు ప్రభావితం అవుతారని చెప్తున్నారు. ఈ అంశాలను కలెక్టర్లు దృష్టిలో ఉంచుకోవాలి.. అంటూ జగన్ ప్రభుత్వ అధికారులని ఆదేశించారు.