Advertisement
Google Ads BL

రాశి నువ్వు గ్రేటమ్మా


కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో చాలామంది ఆకలితో అల్లాడిపోయారు. కరోనా పేషేంట్స్ కి ఆక్సిజెన్ దొరక్క అల్లాడిపోయినట్లే.. లాక్ డౌన్ తో చాలామంది తిండి లేక విలవిల్లాడారు. పనులు లేక చాలామంది పూత గడవక ఇబ్బందులు పడ్డారు. చాలామంది సెలబ్రిటీస్ ఆకలితో ఉన్న పేదల ఆకలి తీర్చారు. మరికొంతమంది ఆక్సిజెన్ సప్లై చేసి కరోనా పేషేంట్స్ కి దేవుడి మాదిరి కనిపించారు. పూజ హెగ్డే, తమన్నా లాంటి వాళ్లకు పేదలకి నిత్యావసరాలు అందించారు. ప్రస్తుతం అవకాశాలతో దూసుకుపోతున్న రాశి ఖన్నా కూడా ఓ స్వచ్ఛంద సంస్థ తో కలిసి పేదల ఆకలి తీర్చింది.

Advertisement
CJ Advs

రోటీ బ్యాంక్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి రాశి ఖన్నా ఆకలితో ఉన్న పేదవారి ఆకలి తీర్చింది. ఎప్పటినుండో రాశి ఖన్నా ఇలాంటి సేవలు అందిస్తున్నా.. చాలా సైలెంట్ గా చేసేసింది. ఈ విషయాన్నీ తాజాగానే బయటపెట్టింది రాశి ఖన్నా. ఇలా ఒక్కదాన్నే చేస్తే కొద్దిమందికి మాత్రమే ఆ సేవలు అందుతాయని, అదే పదిమందికి తెలిస్తే మరికొంతమంది ఈ సహాయాన్ని అందించి చాలామంది ఆకలి తీర్చొచ్చు అని ఇలా ఈ విషయాన్నీ షేర్ చేసాను అంటుంది రాశి ఖన్నా. అంతేకాకుండా 40 రూపాయలు డొనేట్ చేస్తే.. ఒకపూట ఒకరికి ఆహారాన్ని అందించగలుగుతామంటూ రాశి ఖన్నా చేసిన క్యాంపెయినింగ్ తో చాలామంది విరాళాలు ఇవ్వడానికి ముందుకోస్తున్నారు. రాశి ఖన్నా చేసిన ఈ పని చూసిన వారు రాశి ఖన్నా నువ్వు గ్రేట్ అమ్మా అంటున్నారు.

Rashi Khanna donates food to poor people:

Rashi Khanna came forward to help in Corona crisis
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs