Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ తో ఢీ కొడతానంటున్న సేతుపతి


విజయ్ సేతుపతి అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అసలు విజయ్ సేతుపతి సినిమాలకు తెలుగులో ప్రత్యేకంగా ప్రేక్షకులు ఉన్నారు. ఆయన సైరా నరసింహారెడ్డి లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినా.. మాస్టర్ లో విలన్ గా చేసినా, 96 లో హీరోగా చేసినా.. ఏ పాత్రనైనా ఆయన అభిమానులు ప్రేమిస్తారు. విజయ్ సేతుపతి అనగానే ఓ స్పెషల్ క్రేజ్ ఆ సినిమాలపై వచ్చేస్తుంది. ఇంతకుముందే పుష్ప పాన్ ఇండియా ఫిల్మ్ లో అల్లు అర్జున్ కి విలన్ గా నటించాల్సి ఉంది. కొన్ని కారణాలతో విజయ్ సేతుపతి ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. తాజాగా విలన్ రోల్స్ కి ఎక్కువ మొగ్గు చూపుతున్న విజయ్ సేతుపతి ఇప్పుడు ఓ పాన్ ఇండియా మూవీ కి విలన్ గా సెట్ అయ్యాడని.. అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీలో అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది.

Advertisement
CJ Advs

ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాలతో NTR30 చేసేసి.. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో NTR31 చెయ్యబోతున్న ఎన్టీఆర్ ఈ పాన్ ఇండియా మూవీలో విజయ్ సేతుపతి తో తలపడబోతున్నాడట. అసలు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేస్తున్న సలార్ మూవీ కోసమే విజయ్ సేతుపతి విలన్ గా దించాడని టాక్ నడిచినా ఇప్పుడు ఎన్టీఆర్ కోసం విజయ్ సేతుపతి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ డాన్ లా కనిపిస్తాడని, బయోవార్ నేపథ్యంలో ఈ సినిమా కథ ని ప్రశాంత్ నీల్ డెవెలెప్ చేసాడని,  ప్రపంచాన్నే గడగడలాడించే పవర్‌ఫుల్ మాఫియా డాన్‌లా ఎన్టీఆర్‌ని చూపించబోతున్నాడని టాక్. ఇప్పడు ఇదే మూవీలో విజయ్ సేతుపతి విలన్ అంటూ ప్రచారం జరుగుతుంది.

Vijay Sethupathi in Jr NTR and Prashanth Neel film:

Vijay Sethupathi Play Villain Role In NTR31
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs