Advertisement
Google Ads BL

ఏకే రీమేక్ కోసం కదులుతున్న పవన్


కరోనా సెకండ్ వెవ్ ఉధృతి ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రజలు సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. అటు సినిమా పరిశ్రమలోనూ కదలిక వచ్చింది. ప్రస్తుతం సినీ కార్మికులు, సినిమా నటులు అంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకుని షూటింగ్స్ కోసం రెడీ అవుతున్నారు. సోమవారం హీరో నితిన్ తన కొత్త సినిమా షూటింగ్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టేసాడు. ఇక నెమ్మదిగా మిగతా హీరో - హీరోయిన్స్ షూటింగ్స్ కి రెడీ అయ్యి కొత్త షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన కొత్త సినిమా షూటింగ్స్ కి రెడీ అవుతున్నారట. కోవిడ్ నుండి కోలుకుని ఇంటిపట్టునే రెస్ట్ తీసుకున్న పవన్ కొత్త సినిమాల షూటింగ్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నారట.

Advertisement
CJ Advs

అందులో ముందు ఆయన చెయ్యబోయే అయ్యప్పన్ కోషియమ్ మూవీ షూటింగ్ పవన్ వెళ్ళబోతున్నారనే టాక్ నడుస్తుంది. జులై ఫస్ట్ వీక్ నుండి ఏకే రీమేక్ షూటింగ్ మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారట. ఆ తర్వాత వెంటనే క్రిష్ తో చెయ్యబోయే హరిహర వీరమల్లు షూటింగ్ లో పవన్ పాల్గొంటారని సమాచారం. మరోపక్క ఆగష్టు నుండి హరీష్ - పవన్ కాంబో మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి పవన్ ఒకేసరికి మూడు సినిమా షెడ్యూల్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

AK remake makers are planning to resume shoot from next month:

AK remake makers are planning to resume shoot from JULY first week 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs