Advertisement
Google Ads BL

స్పెషల్ ఫ్లయిట్ లో అమెరికాకి సూపర్ స్టార్


సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. గత డిసెంబర్ లో ఆయన ఉన్నట్టుండి సిక్ అవడంతో రజినీకాంత్ నటిస్తున్న సినిమా షూటింగ్ ఆపెయ్యడమే కాదు.. రాజకీయ రంగ ప్రవేశాన్ని కూడా విరమించుకుని ఇంటికే పరిమితమయ్యారు. మార్చ్ లో ఆయన శివ దర్శకత్వంలో నటిస్తున్న అన్నత్తే షూటింగ్ కోసం 45 రోజుల పాటు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో స్టే చేసి.. వైద్యుల పర్యవేక్షణలో షూటింగ్ కంప్లీట్ చేసేసి చెన్నై కి వెళ్లిపోయారు. రజినీకాంత్ అన్నత్తే సినిమా డబ్బింగ్ చెప్పేసి మే నెలాఖరులో అమెరికా ప్రయాణం పెట్టుకున్నారు. ఆరోగ్యపరమైన కొన్ని టెస్ట్ ల కోసం ఆయన అమెరికా వెళ్లాల్సి ఉంది.

Advertisement
CJ Advs

కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆయన అమెరికా ప్రయాణం వాయిదా పడింది. అయితే రజినీకాంత్ ఫ్యామిలీ రజిని అమెరికా ప్రయాణం కోసం తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్రానికి ప్రత్యేక అర్జీ పెట్టుకోవడంతో.. రజినీకాంత్ కి అమెరికా వెళ్ళడానికి అనుమతి లభించింది. స్పెషల్ ఫ్లైట్‌లో రజిని అమెరికా వెళ్లనున్నారు. రజినీకాంత్ కోరిన వెంటనే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. కేవలం 14 మంది ప్రయాణించగలిగే ప్రత్యేక విమానంలో.. రజిని ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి యుఎస్ వెళ్లనున్నారు. ఇక అక్కడికి వెళ్ళగానే రజినీకాంత్ చెకప్స్, టెస్ట్ లు అంటూ బిజీ కానున్నారట.

Superstar Rajinikanth will go to America for medical Checkup:

Rajinikanth To Fly To The US For Medical Check-Up
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs