రైటర్ నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ.. మొదటి సినిమాతోనే ప్రభాస్ లాంటి స్టార్ హీరో ని డైరెక్ట్ చేసి అందరికి షాకిచ్చాడు. ఆ సినిమా ఫలితంతో నిజంగానే అందరూ షాకయ్యారు. ప్రభాస్ కి పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది మిర్చి సినిమా. ఆ తర్వాత కొరటాల శివ వెనుదిరిగి చూసుకోలేదు. వరసగా స్టార్ హీరోలతోనే సినిమాలని తెరకెక్కిస్తూ హీరోలకి ఫెవరెట్ గా మారిపోయాడు. స్టార్ హీరో సినిమాలకుండాల్సిన కమర్షియల్ అంశాలను టచ్ చేస్తూనే సమాజానికి మెస్సేజ్ ఇస్తూ సక్సెస్ ని కొనసాగిస్తున్నాడు. మిర్చి సినిమాలో శత్రువుని గెలవడానికి బలం, బలగం ఉంటే సరిపోదు.. శత్రువు ని కూడా ప్రేమతో గెలవొచ్చనే సందేశాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీమంతుడు సినిమాలో మహేష్ తో ఓ ఊరిని దత్త తీసుకుని ఆ ఊరి బాగు కోసం పెద్దలనే ఎదురించి నిలబడి.. ఊరికి న్యాయం చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
ఆ తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ అంటూ మొక్కలని ప్రేమించేవాడు మనుషులని ప్రేమిస్తాడు.. మొక్కలని జాగ్రత్తగా చూసుకునేవాడు.. మనిషికి కష్టం వస్తే వదలడు అనే కాన్సప్ట్ తో ఎన్టీఆర్ ని అద్భుతంగా చూపించాడు. ఆ తర్వాత పాలిటిక్స్ ని టచ్ చేస్తూ భరత్ అనే నేను సినిమాని మహేష్ తో చేసాడు. అన్ని వరసగా సూపర్ హిట్స్ అవడంతో కొరటాల మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టాడు. చిరు - రామ్ చరణ్ లతో ఆచార్య అంటూ సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి రెడీగా ఉన్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ తో చెయ్యాల్సిన సినిమాని ఎన్టీఆర్ తో మొదలు పెట్టబోతున్నాడు కొరటాల. NTR30 నుండి తివిక్రమ్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి కొరటాల వచ్చి చేరాడు. NTR30 పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది. ఆ సినిమాతో కొరటాల పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశాడు. ఇక ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కొరటాలకి సినీప్రముఖులు నుండి బర్త్ డే విషెస్ అందుతున్నాయి.
అందులో ఎన్టీఆర్ విషెస్ స్పెషల్ గా ఆకట్టుకున్నాయి.
స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Wishing my dear friend and well wisher, @sivakoratala garu a very Happy Birthday అంటూ ట్వీట్ చేసాడు. అంతేకాకుండా NTR30 నుండి కొరటాల ని విష్ చేస్తూ కొరటాల పోస్టర్ ని రిలీజ్ చేసింది టీం.